వైట్హౌస్ ఎదురుగా నగ్న నిరసన | Man strips before whitehouse in protest | Sakshi
Sakshi News home page

వైట్హౌస్ ఎదురుగా నగ్న నిరసన

Published Sat, May 24 2014 1:29 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

వైట్హౌస్ ఎదురుగా నగ్న నిరసన - Sakshi

వైట్హౌస్ ఎదురుగా నగ్న నిరసన

అతగాడికి ఎందుకు కోపం వచ్చిందో.. ఏమో గానీ, సాక్షాత్తు అమెరికా అధ్యక్ష నివాసం అయిన శ్వేత సౌధం ఎదుటే వినూత్నంగా నిరసనకు దిగాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగించడానికి కొద్ది నిమిషాల ముందు వైట్హౌస్ వద్దకు వచ్చి, నేరుగా గేటు ముందుకు వెళ్లాడు. ఒక్కొక్కటిగా ఒంటిమీద ఉన్న దుస్తులన్నింటినీ విప్పేసి, నగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు!! కాసేపు షాక్ తిన్నా, తర్వాత వెంటనే తేరుకున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడివద్దకు చేరుకుని, ఒంటిమీద ఓ ఫాయిల్ షీట్ కప్పేసి, అతడిని అదుపులోకి తీసుకుని ఓ వ్యాన్లో అక్కడినుంచి తరలించారు.

ఇటీవలి కాలంలో అమెరికాలో అత్యంత వేడిగా.. అంటే 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న శుక్రవారం నాడు మిషెల్ బెచర్డ్ అనే వ్యక్తి ఈ సాహసానికి ఒడిగట్టాడు. అమెరికాకు కొత్త గృహనిర్మాణశాఖ కార్యదర్శిని ఎంపిక చేసిన ఒబామా, ఆ విషయాన్ని ప్రకటించడానికి రాబోతుండగా ఈ సంఘటన జరిగింది. అయితే, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకోడానికి ముందే అక్కడున్న కొంతమంది సెల్ఫోన్లలో అతగాడిని చిత్రీకరించారట!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement