వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడిని కూడా ఆటపట్టించేందుకు అవకాశముంటుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓ సాధారణ కమెడియన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓ వ్యక్తి ఆటపట్టించాడు. అదీ ఆయన తన అధికారిక ఎయిర్‌ఫోర్స్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే. అధ్యక్షుడు ట్రంప్‌నకు బుధవారం రాత్రి న్యూజెర్సీ సెనేటర్ రాబర్ట్ మెనెండెజ్ అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అతడు వలస విధానం నుంచి జస్టిస్ ఆంటోనీ కెన్నడీ రిటైరైన తర్వాత ఎవరు నియమితులవుతారనే దాకా పలు విషయాలపై ముచ్చటించారు.
సెనేటర్ రాబర్ట్‌పై గతంలో అవినీతి ఆరోపణలు రాగా దర్యాప్తు అనంతరం నిర్దోషిగా బయటపడ్డారు. ఈ సందర్భంగానే ట్రంప్ దీనిని ప్రస్తావిస్తూ ‘మీరు చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అది మంచి పరిస్థితి అని నేననుకోను’అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంభాషణను కమెడియన్ జాన్ మెలెండెజ్ ‘ది స్టట్టరింగ్ జాన్ పాడ్‌కాస్ట్’లో ఉంచారు. సెనేటర్ సహాయకుడి పేరుతో వైట్‌హౌస్‌కు ఫోన్ చేయగా అక్కడి అధికారులే తనకు ట్రంప్‌తో మాట్లాడేందుకు అవకాశమిచ్చారని అందులో పేర్కొన్నారు. ఈ పరిణామంతో దేశ సర్వసైన్యాధ్యక్షుడి ప్రొటోకాల్ వ్యవస్థ నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అధ్యక్ష భవనం దీనిపై ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
సెనేటర్‌నంటూ ట్రంప్‌ను ఆటపట్టించిన కమెడియన్
Published Sun, Jul 1 2018 1:53 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment