షరన్ రఛేల్ గురుశరణ్ కౌర్
సింగపూర్: అమెరికా నావికాదళ చరిత్రలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఓ కుంభకోణంలో భారత సంతతి మహిళ చిక్కుకుంది. ఆమెకు మూడేళ్లకు పైగా జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. సింగపూర్‌లో అమెరికా నేవీ సప్లయి సిస్టమ్స్ కమాండ్ ఫ్లీట్ లాజిస్టిక్ సెంటర్ కోసం ‘లీడ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్’గా పనిచేస్తున్న షరన్ రఛేల్ గురుశరణ్ కౌర్‌కు రూ.238 కోట్ల (3.5 కోట్ల అమెరికన్ డాలర్ల) విలువైన ‘ఫాట్ లియోనార్డ్’ కుంభకోణంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కౌర్‌కు రూ.65 లక్షలకు పైగా ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ.
Comments
Please login to add a commentAdd a comment