భారత సంతతి వ్యక్తికి 30 నెలల జైలు
Published Thu, Feb 25 2016 9:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM
న్యూయార్క్: భారత సంతతికి చెందిన 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ నిపుణుడు నిఖిల్ నిలేష్‌కు న్యూయార్క్ కోర్టు 30 నెలల జైలు శిక్షతోపాటు 3 లక్షల డాలర్ల జరిమానా విధించింది. నిఖిల్ 2007 నుంచి 2012 మార్చి వరకు నార్త్ కరోలీనాలో పనిచేశారు. అక్కడ ఉద్యోగం వదిలేశాక సంస్థ సర్వర్లకు ప్రమాదకరమైన కోడ్‌తో కూడిన సాఫ్ట్‌వేర్‌ను పంపాడు. దీంతో ఆ సంస్థ విలువైన తన ఆస్తి కోల్పోవడంతో ఆర్థికంగా నష్టపోయింది. దీంతో కేసును విచారించిన నార్త్ కరోలీనాలోని కోర్టు షాకు 30 నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.
Advertisement
Advertisement