ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్‌ చంద్ర గార్గ్‌ | Subhash Chandra Garg Appointed As AP CM Advisor | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్‌ చంద్ర గార్గ్‌

Published Sun, Mar 1 2020 11:46 PM | Last Updated on Mon, Mar 2 2020 10:48 AM

Subhash Chandra Garg Appointed As AP CM Advisor - Sakshi

ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. నిధుల సమీకరణ వ్యవహారాల కోసం ఆయనను నియమించింది. సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ రెండేళ్ల పాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.

సుభాష్‌ చంద్ర గార్గ్‌కు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవముంది. గార్గ్.. రాజస్తాన్‌ కేడర్-1983 ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ గార్గ్ వ్యవహరించారు. ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డు, సెబీ లో ఒక సభ్యునిగా కొనసాగారు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థ ఎల్‌ఐసీలోనూ ఈయన సేవలు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement