Vinod Verma
-
హిందీకి అరి
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్‌పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్‌కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్. -
Ari Movie: ఆసక్తి పెంచుతోన్న వినోద్ వర్మ ఫస్ట్ లుక్!
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అరి’.'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ‘అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘అరి’ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. -
సీఎం సలహాదారుగా అశ్లీల సీడీ నిందితుడు
రాయ్‌పూర్ : గత ఏడాది కలకలం రేపిన సెక్స్ సీడీ ఉదంతంలో పేరు వినిపించిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. అశ్లీల సీడీ కేసులో బీజేపీ నేత ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు మేరకు 2017 అక్టోబర్‌లో వర్మను ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సీడీ పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేశారని పాండ్రి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు చేయడంతో వర్మను అరెస్ట్ చేశారు. ఇక వర్మతో సహా సీఎంకు నలుగురు సలహాదారులను నియమిస్తూ చత్తీస్‌గఢ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ దినపత్రిక ఎడిటర్‌గా రాజీనామా చేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మరో జర్నలిస్టు రుచిర్ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా నియమించారు. ఇక ప్రదీప్ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేష్ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమితులయ్యారని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
ఒకేసారి రెండు సినిమాలు
చంద్రకాంత్, ఉమేశ్, వర్షిత జంటగా ‘ప్రేమవేదం’, ‘సూర్యనేత్రం’ పేరుతో ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటికీ దర్శక - నిర్మాత వినోద్‌వర్మ. ఈ సినిమాలతో తమకు గుర్తింపు వస్తుందని హీరో హీరోయిన్లు ఆశాభావం వెలిబుచ్చారు. వినోద్‌వర్మ మాట్లాడుతూ, ‘‘ఇరవై మూడేళ్లుగా పరిశ్రమలో పలు శాఖల్లో పనిచేశాను. టాటా మూవీస్ సంస్థ స్థాపించి, కొత్తవారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటిగా షూటింగ్ జరిపి, పూర్తిచేస్తాం’’ అని తెలిపారు.