
సాయి కుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది.
త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్‌పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్‌కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment