Ari
-
అనసూయ సినిమాపై అభిషేక్ కన్ను.. ఎందుకో తెలుసా..?
-
హిందీకి అరి
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. ‘పేపర్ బాయ్’ చిత్రదర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘ఈ చిత్రం విడుదలకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ఈ సినిమా హిందీ రీమేక్‌పై అభిషేక్ బచ్చన్ ఆసక్తిగా ఉన్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా.. ఈ చిత్రం ప్రివ్యూని అభిషేక్ బచ్చన్‌కి చూపించారట దర్శకుడు జయశంకర్. కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉందని, హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: కృష్ణ ప్రసాద్. -
జెలసీ చూపిస్తున్న అనసూయ
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అరి". మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాత్రలనును రివీల్ చేశారు. జెలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న అరి విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. చదవండి: అతడు నాకేమీ కాడు, ఆయన్ని బతకనీయండి: రాఖీ దగా.. మోసం.. భర్తను కాదని అతడికి మెరీనా సపోర్ట్ -
పైర్లకు ఊపిరి!
ఎమ్మిగనూరులో అత్యధికంగా 95.6 మిమీ వర్షం 57శాతం భూముల్లో పంటలు సాగు వారం రోజుల్లోనే లక్షకు పైగా హెక్టార్లలో పంటలు కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెలలో వర్షాలు కొంత అలస్యం అయినా ఆశాజనకంగా పడుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎమ్మిగనూరు, దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో భారీ వర్షాలు పడటంతో హంద్రీకి వరద నీరు భారీగా వచ్చింది. అయా మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత వారం నాటికి జిల్లాలో 2.48 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగు అయ్యాయి. వర్షాలు పడుతుండటం వల్ల వారం రోజులు వ్యవధిలో లక్ష హెక్టార్లకు పైగా పంటలు సాగు కావడం విశేషం. పత్తి, కంది, వేరుశనగ సాగు గణనీయంగా పెరుగతోంది. మంగళవారం రాత్రి అత్యధికంగా 95.6 మిమీ వర్షపాతం నమోదు అయింది. దేవనకొండలో 87.4, మద్దికెరలో 74.4, గొనెగండ్లలో 72.6, పత్తికొండలో 55.4, నందవరంలో 48.0, తుగ్గలిలో 46.4, మంత్రాలయంలో 41.2, ఆస్పరిలో 40.0, శిరువెళ్లలో 39.6, నంద్యాలలో 38.0, మహనందిలో 34.2, దొర్నిపాడులో 33.0, చిప్పగిరిలో 30.0,బండి ఆత్మకూరులో 28.2 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 117.2 మిమీ ఉండగా ఇప్పటి వరకు 90.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. పది రోజులు వ్యవధిలోనే 65 మిమీ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఈ నెల మొదటి నుంచి వర్షాలు లేకపోవడం వల్ల పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు పూర్తి స్థాయిలో కోలుకున్నాయి. మరో 10 రోజుల్లో వర్షాధారం కింద పూర్తి స్థాయిలో సాగు అయ్యే అవకాశం ఉంది. పత్తి సాగు భారీగానే.. జిల్లాలో పత్తి భారీగానే సాగు అయింది. ఇప్పటికే 1.10 లక్షల హెక్టార్లలో సాగు కావడం విశేషం. కంది సాగు క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 65,123హెక్టార్లు, వేరుశనగ 84,425, మినుము 10096, మొక్కజొన్న 19095, ఆముదం 13170, మిరప 9085, ఉల్లి 13465 హెక్టార్లలో సాగు చేశారు. సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.53 లక్షల(57 శాతం) హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. -
హీరో, హీరోయిన్ల స్ట్రీట్ ఫైట్
సాధారణంగా ఒక యువతి, యువకుడి మధ్య చిన్న గొడవ జరిగితేనే పెద్ద సీన్‌గా మారుతుంది. అలాంటిది ఒక అందమైన యువతి మంచి వయసులో ఉన్న యువకుడితో నడిరోడ్డులో ఫైట్ చేసిందంటే విషయం సీరియస్ అయ్యే ఉండాలి. ఏదేమైనా ముందు వాగ్వాదంతో మొదలైన వీరి గొడవ చిలికి చిలికి గాలివానగా మారినట్లు ముష్టి యుద్ధానికి దారి తీసింది. శివగంగై జిల్లా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్న పూలాంగుచ్చి గ్రామంలో జరిగిన ఈ వయసుకు వచ్చిన వారి స్ట్రీట్ ఫైట్ వాతావరణాన్ని వేడేక్కించింది. ముందు అంతగా పట్టించుకోని ఆ గ్రామ ప్రజలు గొడవ హద్దు మీరుతుందని భావించి పోలీసులకు సమాచారం అందించడానికి సమాయత్తం అవుతున్న సమయంలో ఒక మూల నుంచి కట్ అనే మాట వినిపించింది. దీంతో అది సినిమా షూటింగ్ అని తెలుసుకుని ప్రజలు రిలాక్స్ అయ్యారు. ఈ రసవత్తరమైన సన్నివేశం ఉన్నోడు కా చిత్రం కోసం నవ దర్శకుడు ఆర్కే చిత్రీకరించారు. అభిరామి మెగామాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరామి రామనాథన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. నెడుంశాలై, మాయ చిత్రాల ఫేమ్ ఆరి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా డార్లింగ్-2 చిత్రం ఫేమ్ డాక్టర్ మాయ కథానాయికిగా నటిస్తున్నారు. ప్రభు, ఊర్వశి, తెన్నవన్, మనోబాలా, మన్సూర్ అలీఖాన్, శివరంజని, సుబ్బు పంజు, బాలశరవణన్, మిషాగోషల్, శామ్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆరి తెలుపుతూ చక్కని పచ్చదనంతో కూడిన పూలాంగురించ్చి గ్రామంలో షూటింగ్ నిర్విహిస్తున్న అభిరామి రామనాథన్‌కు థ్యాంక్ చెప్పుకుంటున్నానన్నారు. ఇది ఆయన సొంత ఊరని తెలిపారు. దీన్ని ఆయన దత్తత తీసుకుని, పలు సేవాకార్యక్రమాలతో అభివృద్ధి చేశారని వివరించారు. ఇందులో తాను యాక్షన్‌తో కూడిన రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. నటి మాయది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని చెప్పారు. సీనియర్ నటుడు ప్రభు, ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రభు అందరిని ప్రేమగా పలకరిస్తూ అందరి అభిమాన్ని చూరగొనడం విశేషం అన్నారు.యూనిట్ సభ్యులకు ఆయన మంచి విందును ఇచ్చారని తెలిపారు.చిత్రం జనరంజకంగా తెరకెక్కుతోందని ఆరి వెల్లడించారు.