సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ కన్నుమూత | senior journalist dasari ravinder died in hyderabad | Sakshi
Sakshi News home page

సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ కన్నుమూత

Published Sat, Apr 16 2016 4:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ కన్నుమూత - Sakshi

సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ కన్నుమూత

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు దాసరి రవీందర్(42) శనివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వరుసగా రెండు ఆపరేషన్లు నిర్వహించగా..  ఈ రోజు మధ్యాహ్నం మరణించారు. ఆయన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీఆర్వోగా ఉండేవారు.

దాసరి రవీందర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా రాయికల్. గతంలో ఆయన సాక్షి టీవీలో సీనియర్ కరస్పాండెంట్గా విధులు నిర్వహించారు. రవీందర్ మృతికి సాక్షి యాజమాన్యం, సిబ్బంది సంతాపం ప్రకటించింది. రవీందర్ మృతి కారణంగా మిషన్ కాకతీయ మీడియా అవార్డుల కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement