
బైక్ ప్రమాదానికి గురైన ఖాజా మొహినుద్దీన్
నిర్లక్ష్యం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు(బ్రెయిన్ డెడ్) తీసింది. అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా తగిన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో చెప్పలేం. సరిగ్గా హైదరాబాద్‌లో ఇలాంటి విషాదం ఒకటి చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
సాక్షి, హైదరాబాద్ : ఖాజా మొహినుద్దీన్(35) నగరంలోని బహదుర్‌పురలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ పని మీద బయటకు వెళ్లాడు. తొలుత నో పార్కింగ్ ప్లేస్‌లో బైక్ పార్క్ చేసిన ఖాజా ఆపై ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడుపుతున్నాడు. సెల్‌ఫోన్లో మాట్లాడుతున్న అతడు బహదుర్‌పురా నాలా సమీపంలో రాంగ్‌రూట్‌లో రోడ్డు క్రాస్ చేసేందుకు చూడగా ఖాజా బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖాజా తల నేరుగా రోడ్డుకి గట్టిగా తాకడంలో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. హెల్మెట్ ధరించక పోవడంతో పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్లే ఖాజాకు బ్రెయిన్ డెడ్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment