
శృతి(ఫైల్)
సోమాజిగూడ: బైక్‌పై వెళుతున్న తల్లికూతుళ్లను లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా..కుమార్తె బ్రైయిన్ డెడ్‌కు గురైన సంఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఐకె గూడకు చెందిన శృతి (26) సాప్ట్ ఉద్యోగి. ఈ నెల 8న తల్లి మాధవితో కలిసి బైక్‌పై ఈసీఐల్‌కు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శృతిని చికిత్స నిమిత్తం ఈ నెల 9న బంజారా హిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు నిర్దారించారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె శరీరంనుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లనుసేకరించి మరో ఐదుగురికి ప్రాణ దానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment