సాక్షి సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌రావు హఠాన్మరణం | senior journalist murali mohan rao passes away | Sakshi
Sakshi News home page

సాక్షి సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌రావు హఠాన్మరణం

Published Mon, Feb 3 2014 1:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సాక్షి సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌రావు హఠాన్మరణం - Sakshi

సాక్షి సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌రావు హఠాన్మరణం


సాక్షి, హైదరాబాద్: సాక్షి సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీ మోహన్‌రావు(57) ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ అత్తాపూర్‌లో నివాసముంటున్న ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన మురళీమోహన్‌రావు గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో రీజియన్ డెస్క్‌లో చీఫ్ సబ్‌ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

 

మురళీమోహన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణవార్త తెలియగానే సాక్షి సిబ్బందిలో విషాదం నెలకొంది. సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళీతోపాటు సహచర ఉద్యోగులు, సిబ్బంది కేర్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మురళీమోహన్‌రావు హఠాన్మరణం పట్ల జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అత్తాపూర్‌లోని సంగం స్మశాన వాటికలో సోమవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement