
హైదరాబాద్: తెలంగాణ పోరాట యోధుడు, సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వర్‌రావు(78) ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలోని స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 60 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. ఆంధ్రభూమి, గోల కొండ, ఆంధ్రజ్యోతి, ఉదయం, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర దినపత్రికల్లో హైదరాబాద్, ఢిల్లీలో వివిధ హోదాల్లో పని చేశారు. జనతా, రాజధాని పత్రికలను నడిపారు.
ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకల్లో కేసీఆర్ నుంచి ఆదిరాజు ఉత్తమ పాత్రికేయునిగా అవార్డు అందుకున్నారు. ఆదిరాజు భౌతిక కాయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సాక్షి దినపత్రిక ఈడీ రామచంద్రమూర్తి, పలువురు రాజకీయనేతలు, పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు. షేక్‌పేట్ మహాప్రస్థానంలో ఆదిరాజు వెంకటేశ్వర్‌రావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదిరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆదిరాజు ఎంతగానో కృషి చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment