
సాక్షి, చిత్తూరు: సీనియర్ జర్నలిస్టు, ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి కన్నుమూశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం తెల్లవారుజామున గోపి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. గత వారం రోజులుగా గోపి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గోపి కుటుంబానికి సాక్షి మీడియా ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
ప్రముఖుల సంతాపం:
► సీనియర్ జర్నలిస్టు, ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి అకాల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు.
► సీనియర్ జర్నలిస్ట్ గోపి హఠాన్మరణం పట్ల ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. గోపి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment