సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు (76) శుక్రవారం కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. పత్రికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా ఆయనకు మంచిపేరు ఉంది. వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దీక్షితులు మృతిపై సీఎం సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గుండెపోటుతో మృతిచెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా పనిచేసిన దీక్షితులు మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. దీక్షితులు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment