Press Academy
-
‘రాష్ట్రంలో 31లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరు’
సాక్షి, అమరావతి: ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల పరిపాలన - తీరు తెన్నులు అనే అంశంపై సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలపై మేధావులు, సీనియర్ జర్నలిస్టులతో ఈ సమావేశం కొనసాగింది. ఈ చర్చలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, అధికార భాషా కమిటీ చైర్మన్ విజయబాబు, ఆంధ్రా లయోలా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.సి.దాస్, ఏఎన్ యూ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు చలపతిరావు, కృష్ణంరాజు, కె.బి.జి. తిలక్, సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, ఏఎన్ యూ జర్నలిజం హెచ్ఓడీ అనిత, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనపై ప్రముఖ రచయిత రామచంద్రారెడ్డి రాసిన సుపరిపాలన - సుజలాం, సుఫలాం పుస్తకాన్ని ఇందులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార భాష కమిటీ చైర్మన్ విజయబాబు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఆటుపోట్ల మధ్య, ముష్కర మూకల దాడులను తట్టుకుని నాలుగేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ అయితే ఎదో చేస్తారని ఇష్టం లేకపోయినా చంద్రబాబును 2014లో ఎన్నుకున్నారని చెప్పారు. ఈనాడు రాతలని ప్రజలు విశ్వసించరని, ఆంధ్రులు ఆవులు తోడేళ్ల గుంపును తరిమికొట్టి 23సీట్లకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. కొమ్మినేని శ్రీనివాసరావు మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. "నా 45ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇన్ని మార్పులు చూడలేదు, పోర్టుల నిర్మాణం, పాలనా వికేంద్రీకరణలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది, జగన్ పాలనను నరకంతో పోల్చుతూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది, పేదలకు స్వర్గం, పెత్తందారులకు నరకంలా ఉందనేది నా అభిప్రాయం. జన్మభూమి కమిటీల వద్దకు కాళ్ళు తిరిగేలా తిరగడం నరకం. ఇంటికే వచ్చి ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం స్వర్గం. జగన్ చేసే సంక్షేమం నరకం.. చంద్రబాబు చేస్తే స్వర్గమా..? అని ప్రశ్నించారు. రామచంద్రా రెడ్డి రచయిత రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న జీవ క్రాంతి అనేది గొప్ప పథకమని, రాష్ట్రంలో 31లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరని కొనియాడారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసూయకు మందు లేదని, మంచిపని చేసేటపుడు ఆటంకపరిచేవారిని ఖండించాలన్నారు. కృష్ణంరాజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొన్ని వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కప్పి పెడుతున్నాయని మండిపడ్డారు. 9ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 10లక్షల కోట్లు పథకాల రూపంలో ప్రజలకు నగదు బదిలీ చేస్తే.. రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్లలో 2.11లక్షల కోట్లు బదిలీ చేసిందని కొనియాడారు. జీడీపీలో దేశంలోనే ఏపీ నెంబర్.1 స్థానంలో ఉందని తెలిపారు. ఎంవీఎస్ నాగిరెడ్డి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సంక్షేమ పాలనకు ఆ రోజు పావురాలగుట్టలో ఇచ్చిన మాటతోనే పునాది పడింది, 2004లో వైఎస్సార్ సంక్షేమాన్ని అమలు చేసారు, అనంతరం వచ్చిన ఎన్నికల్లో కూటమితో వచ్చి చంద్రబాబు ఓటమి పాలయ్యారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే మళ్లీ ఎన్నికలకు రాను అని జగన్ అన్నారు. నాలెడ్జబుల్ గా ఏ సలహా ఇచ్చినా జగన్ స్వీకరిస్తారు, హార్టికల్చర్ హబ్ గా ఏపీ తయారైంది, డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. పేదవాళ్ల కోసం పనిచేసేవాడే కామ్రేడ్ అయితే నేనే పెద్ద కామ్రేడ్ అని వైఎస్సార్ అన్నారు. ఈ రోజు కమ్యూనిస్టులు ఎవరికోసం పని చేస్తున్నారు? మరోసారి అవకాశమిస్తే 2014 నుండి 2019 మాదిరిగా పాలిస్తానని చంద్రబాబు చెప్పగలరా.? మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చంద్రబాబు చెప్పగలరా.? భారతదేశంలో జరిగిన అతిపెద్ద మోసం 2019ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ. రైతులు ఇచ్చిన 12లక్షల గ్రీవెన్స్ ను పక్కన పడేసారని అన్నారు. ఎంసీ దాస్ ఆంధ్రా లయోలా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లయోలా కళాశాల విద్యార్థి అని చెప్పారు. YSR కుమారుడిని నేను జగన్ ను పొగడను.. ఆశీర్వదిస్తాను, GDP గ్రోత్ విషయంలో దేశంలోనే AP మొదటిస్థానంలో ఉంది, సముద్ర తీరాన్ని, నదులను వినియోగించటంలో రెండోస్థానంలో ఉంది, వ్యవసాయ రంగంలో 13శాతం, పారిశ్రామిక రంగంలో 16శాతం వృద్ధిని ఏపీ సాధించింది, కోకో, మాంగో, పాపాయి, రెడ్ చిల్లి ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని గుర్తు చేశారు. చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే దేశంలోనే కాదు ఆసియాలోనే ఏపీ నెం.1 అవుతుందని, సీఎం జగన్ చేస్తున్న హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా ఉత్పాదక శక్తి పెరుగుతుందని తెలిపారు. అప్పులు తగ్గి ఆదాయం పెరిగితే ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మరింత సంక్షేమాన్ని ఇస్తారని చెప్పారు. -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
రాయలసీమ ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: జర్నలిజం రంగంలో ఆయన సవ్యసాచి. ప్రజలు, ప్రజాహక్కులు, రాయలసీమ అస్థిత్వంపై పోరాటం, అడ్డదిడ్డంగా పయనిస్తున్న యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, రాయలసీమకు అనువైన రాజకీయాలను నెరిపేందుకు నేతల్ని ఏకీకరణ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఆయన సొంతం. రాయలసీమ కోసం దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఎంచుకున్న ఉద్యమపథం ఆదర్శనీయం. కలాన్ని కరవాలంగా ధరించిన ఆ పెద్దరికం కనుమరుగైంది. ► కడప జిల్లా సింహాద్రిపురం దగ్గర కోరుగుంటపల్లెలో సంపన్న కుటుంబంలో దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి జన్మించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఆయన వారి తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. 1978 లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చేరారు. కొద్దిరోజులు బెంగుళూరులో పనిచేసి, కడప స్టాప్రిపోర్టర్గా దాదాపు 30 ఏళ్లు పనిచేశారు. ఆ తరువాత కొంతకాలం తిరుపతి, హైదరాబాద్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. జర్నలిస్ట్‌గా ఆయన ప్రస్థానంలో అనేక ఘటనలకు ఆయనే కేంద్ర బిందువుగా నిలవడం విశేషం. ఎన్టీఆర్‌కు ఎదురుప్రశ్న.. ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు జిల్లాలోని ముద్దనూరు పర్యటనకు వచ్చారు. అప్పట్లో రాయలసీమ వెనుకబాటు తనంపై ఉద్యమం బాగా నడుస్తోంది. ఆ పరిస్థితుల్లో జిల్లాకు వచ్చిన ఎన్టీఆర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాయలసీమలో సాగు, తాగునీటికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా వివరిస్తూనే, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎన్ని కిలోమీటర్లు నీరు పారుదల చేయనున్నామో వివరించసాగారు. ఆ సందర్భంలో ‘ఎక్స్క్యూజ్్ మీ.. చిన్న డౌట్ సార్’ అంటూ శ్రీనాథ్‌రెడ్డి గళం విప్పారు. 1 టీఎంసీ నీటికి ఎన్ని ఎకరాలు సాగుచేయవచ్చు సార్.. అంటూ ప్రశ్నించడంతో ఎన్టీఆర్ నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో సందర్భంలో చింతకొమ్మదిన్నె సమీపంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన బహిష్కరించి ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమాన్ని అదే రోజు కడపలో అప్పటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డిచే ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడి హోదాలో శ్రీనాథ్‌రెడ్డి నిర్వహించడం విశేషం. దమ్మున్న జర్నలిస్టుగా ఆయనకు ఆయనే సాటి. సంచలనంగా ‘సెవెన్‌రోడ్స్ జంక్షన్’.. జర్నలిస్టుగా శ్రీనాథ్‌రెడ్డికి ఇంగ్లీషు, తెలుగు భాషలో విశేష నైపుణ్యం ఉంది. ప్రతిపదం అర్థవంతంగా.. ఆలోచనాత్మకంగా రాయడంలో ఆయన దిట్ట అని అప్పటి తరం జర్నలిస్టులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రతి బుధవారం ఆంధ్రప్రభలో ‘సెవెన్‌రోడ్స్ జంక్షన్’ శీర్షికతో శ్రీనాథ్‌రెడ్డి కొన్ని ఏళ్లపాటు ఏకదాటిగా ప్రత్యేక కథనాలు రాసేవారు. అందులో ఇప్పటికీ గుర్తుండిపోయే వార్తలు చాలా ఉన్నాయి. వాటిలో.. ఇద్దరు పార్లమెంటు సభ్యుల గురించి ‘ఆవు–దూడ’. ఎస్పీగా ఉమేష్‌చంద్ర పనితీరుపై ‘ఎగిరిపడుతోన్న ఎర్రటోపీ’ రాయచోటి ఉప ఎన్నికలపై ‘రిగ్గుడు వాడే–నెగ్గుడు’ ఇలాంటి దమ్మున్న శీర్షికలు ఎన్నో పెట్లారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలు సైతం.... ప్రజాస్వామ్య రాజకీయ నేతలు, పౌరహక్కుల నేతలు.. ఉత్తర దక్షిణ ధ్రువాలుగా 90వ దశకం కంటే ముందు ఉండేవారు. అలాంటి ఉత్తర, దక్షిణ ధ్రువాలకు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి అనుసంధానకర్తగా నిలిచారు. అప్పట్లో జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసిన న్యాయవాది కె. జయశ్రీపై రెండు తప్పుడు కేసులను పోలీసులు బనాయించారు. ఆ కేసులు తప్పుడు కేసులని.. జయశ్రీపై బనాయించడం ఏంటని ఎస్పీని శ్రీనాథ్‌రెడ్డి ధైర్యంగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► పౌరహక్కుల నేత బాలగోపాల్ జిల్లా పర్యటనకు వస్తే శ్రీనాథ్‌రెడ్డితో చర్చించేవారు. రాయలసీమలో విభిన్న రాజకీయ పార్టీల నేతలు, వారి వారి రాజకీయ పరిమితులు ఎలా ఉన్పప్పటికీ శ్రీనాథ్‌రెడ్డి కార్యాలయంలో సమ ప్రాధాన్యత లభించేది. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు.... కడప జిల్లా జర్నలిస్టు దిగ్గజం. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి భౌతికకాయం శుక్రవారం ఉదయం స్వగ్రామం కోరుగుంటపల్లెకు చేరనుంది. బంధువులు, సన్నిహితులు, ప్రజల సందర్శన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్.... రెండు దశాబ్దాలపాటు కడప శివలింగంపిళ్లై వీధిలోని శ్రీనాథ్‌రెడ్డి ఆఫీసు రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్. రాజకీయ ఉద్దండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎంవీ రమణారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, జేసీ దివాకరరెడ్డి, ఆర్. రాజగోపాల్ రెడ్డి మొదలుకుని.. రాయలసీమ ఉద్యమంతో ముడిపడిన అందరి తలలో నాలుకగా ఆయన నిలిచారంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ నలుదిక్కుల నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకూ పాదయాత్ర చేపట్టాలనే కీలక నిర్ణయానికి రాజకీయ నేతలను ఏకీకరణ చేయడంలో ప్రధాన పాత్ర ఈయనదేనని నాటి ఉద్యమనేతలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షుడుగా, కోఆపరేటివ్ కాలనీ ప్రతాప్‌రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటైన ‘రాయలసీమ యువపోరాట సమితి’ కూడా ఈయన కార్యాలయంలో పురుడు పోసుకుంది. విలువలకు పెద్దపీట వేసిన శ్రీనాథ్‌రెడ్డి వైవీయూ : విలువలకు పెద్దపీట వేస్తూ పాత్రికేయానికి సరైన అర్థంలా నిలిచిన సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మృతి ఆవేదనకు గురిచేసిందని వైవీయూ వీసీ ఆచార్య జింక రంగజనార్ధన, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, గజ్జల మల్లారెడ్డి ట్రస్ట్ కన్వీనర్ డా. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. వైవీయూ ద్వారా గజ్జెల మల్లారెడ్డి స్మారక పురస్కారం–2019ని ఆయన అందుకున్నారని గుర్తుచేశారు. -
‘ఆ బాధ్యత జర్నలిస్టులదే.. మీడియా గుర్తుంచుకోవాలి’
సాక్షి, విజయవాడ: నిబద్ధతతో పనిచేసే విలేకరుల అవసరం నేడు ఎంతైనా ఉందని, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లటంతో విలేకరుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాలు- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీడియా పాత్ర అంశంపై అవగాహన సదస్సు ఆదివారం ఆర్టీసీ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్ష్యతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయటానికి పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. నేడు కమ్యూనికేషన్ రంగం వేగంగా విస్తరిస్తుందని, వాటి ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో భాగమైన సోషల్ మీడియాలో కూడా వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. నిష్పక్షపాత జర్నలిజానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించటం వలన నిజాన్ని కొద్ది రోజులు మాత్రమే తొక్కి పెట్టగలమని గుర్తించాలన్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో ఈ ధోరణి పెరిగిపోయిందని, వాటిని సరిదిద్దుకోవటం వలన సమాజానికి మేలు జరుగుతుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అంతిమంగా ప్రజలకు వాస్తవాలు అందించే మీడియాకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. సైనికుడి చేతిలో ఆయుధం.. విలేకరి చేతిలో కలం ఒకటే: కొమ్మినేని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, సైనికుడి చేతిలో ఆయుధం, విలేకరి చేతిలో కలం ఒకేటనన్నారు. నిజాన్ని నిర్భయంగా వెల్లడించటానికి కలం కత్తి కంటే పదునుగా ఉపయోగించాలన్నారు. విలేకరులు సేవా దృక్పథంతో ఉండాలని, నిజాలను నిర్భయంగా వెల్లడించటానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదన్నారు. నిజం నత్తనడకన నడిస్తే అబద్ధం మెరుపు వేగంతో నడుస్తుందని చమత్కరించారు. కాని జర్నలిస్టులు మాత్రం నిజానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, అర్థసత్యాలు, అసత్యాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని సూచించారు. పత్రికలకు విశ్వసనీయతే ప్రాణం: మల్లాది విష్ణు ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ పత్రికలకు విశ్వసనీయతే ప్రాణమన్నారు. ఒక పత్రికలో వచ్చిన వార్తకు ఖండన మరో పత్రికలో రావటం అనే కొత్త సాంప్రదాయం ఇటీవల మొదలైందన్నారు. అది మంచి సంస్కృతి కాదన్నారు. అయితే బురద జల్లటానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్న పత్రికల దాడిని తిప్పి కొట్టడానికి మేము రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ట్స్ సమ్మిట్ పై కూడా అబద్ధాలు ప్రచారం చేశారని విచారం వ్యక్తం చేశారన్నారు. జర్నలిస్టులు సమాజానికి ప్రయోజకారిగా ఉండాలి: మందపాటి శేషగిరిరావు రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ అవాస్తవాలను ప్రచారం చేస్తే నడిచే ప్లేగు వ్యాధి అని ఓ ఇంగ్లీషు కవి అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టులు సమాజానికి ప్రయోజకారిగా ఉండే రచనలు చేసిన పుస్తకాలను గ్రంధాలయ సంస్థ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని ఒప్పంద పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, ఎన్నార్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్, జర్నలిస్ట్ ప్రతిక సంపాదకులు కృష్ణంరాజు, అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ కేవీ శాంత కుమారి, ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పత్రికా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పశ్చిమగోదావరి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
ఆదర్శంగా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలు
విజయనగరం గంటస్తంభం: దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వేతనాల స్థిరీకరణ, ఉద్యోగ భద్రత కల్పించేలా కలిసి ముందుకు సాగాలన్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ విజయనగరం మీడియా జర్నలిస్టులకు ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. పాత్రికేయులు రాసే వార్తలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుకుంటుందని తెలిపారు. నకిలీ జర్నలిస్టులను గుర్తిస్తే అసలైన జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌లు మీడియా నిబద్ధతపై ప్రసంగించారు. ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్ తిలక్ శిక్షణ తరగతులను పర్యవేక్షించగా, సీనియర్ పాత్రికేయులు కె.స్రవంతి చంద్ర, శశాంక్ మోహన్‌లు శిక్షణ ఇచ్చారు. -
కరోనా బాధిత జర్నలిస్టులకు రూ.3 కోట్ల సాయం
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన 1,603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మీడియా అకాడమీ చరిత్రలో ఇంత పెద్దఎత్తున సాయం అందించడం ఒక మైలు రాయిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సమాచార భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్, గుర్తింపు కార్డు, పాజిటివ్ వచ్చిన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలను పంపడంతో వారికి ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇంకా కరోనా బారిన పడిన జర్నలిస్టులు ఉంటే తమ వివరాలను పంపాలని, వివరాలకు 80966 77444, 96766 47807లను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో అకాడమీ కార్యదర్శి డీఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 442 మంది పాత్రికేయులకు రూ.80 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. వివరాలకు తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ నెంబర్ 8096677444 లేదా మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్‌కుమార్ సెల్ నెంబర్ 9676647807ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
వాసుదేవ దీక్షితులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు (76) శుక్రవారం కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. పత్రికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా ఆయనకు మంచిపేరు ఉంది. వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీక్షితులు మృతిపై సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గుండెపోటుతో మృతిచెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా పనిచేసిన దీక్షితులు మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. దీక్షితులు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
ప్రజా సంఘాలపై దాడులు సరికాదు
పొత్తూరి వెంకటేశ్వర్రావు హైదరాబాద్: ప్రజా సంఘాలపై ప్రభుత్వం దాడులకు పాల్పడటం సరికాదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర్రావు అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ప్రజా కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీజ్ చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) కార్యా లయాన్ని తెరిపించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. పొత్తూరి మాట్లాడుతూ ఇలాంటి చర్యల ద్వారా పోలీసులు సాధించేదేమీ లేదన్నారు. కళా కారులు, కవులు, రచరుుతల జోలికి వెళితే ప్రజలు తిరగ బడతారన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇంకా పాత పద్ధతినే అను సరిస్తున్నాయని, పోలీసులు అనుకుంటే ఎవరినైనా నేర స్తుల్ని చేస్తారని ఆరోపించారు. సీనియర్ సంపాదకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ విమలక్క పాట లేకుం డా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించ లేమన్నారు. విమలక్క మాట్లాడుతూ తన కార్యాలయాన్ని సీజ్ చేశారు.. అనటం కంటే పోలీసులు కబ్జా చేశారంటే బాగుంటుం దన్నారు. పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ లేకుండా పోలీసులు ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్దన్, సీపీఐ నేత కందిమల్ల ప్రతాప్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాసీం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ లోక్‌సత్తా నాయ కుడు మన్నారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సంక్షేమనిధికి దరఖాస్తులు
హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంక్షేమనిధి ద్వారా అర్హులకు సాయమందించేందుకు ప్రెస్ అకాడమి ముందుకు వచ్చింది. అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ల ధ్రువీకరణతో ప్రెస్ అకాడమి కార్యదర్శికి ఈ నెల 15లోగా సమర్పించాలని తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2014 జూన్ 2 తర్వాత ప్రమాదానికి గురైన, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయలతోపాటు ప్రతి నెలా 3 వేల రూపాయల పింఛన్‌ను ఐదేళ్లపాటు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మరణించినవారి ఇద్దరు పిల్లలకు పదో తరగతి పూర్తయ్యే వరకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజు చెల్లించనున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురై పనిచేయలేని పరిస్థితిలో ఉన్నవారికి 50 వేల రూపాయలు అందజేయనున్నట్లు వివరించారు. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కనీసం మూడేళ్ల అనుభవంతోపాటు వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలకు లోబడి ఉన్నవారు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫారాలను తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో జీవో నం.225ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, లేదా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం నుంచి కూడా పొందవచ్చని తెలిపారు. సహాయనిధి నుంచి సాయం అందించేందుకుగాను ప్రభుత్వం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఒక కమిటీని వేసిందని తెలిపారు. దేశంలో గుర్తింపు పొందిన జర్నలిజం కళాశాలలో ఉన్నతవిద్యను అభ్యసించే వర్కింగ్ జర్నలిస్టులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.లక్ష, విదేశాల్లో గుర్తింపు పొందిన జర్నలిజం కళాశాలలో చదివేవారికి 5 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు అల్లం నారాయణ వెల్లడించారు. -
పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్రూం కాలనీలు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిట్యాల: పాత్రికేయుల కోసం ట్రిపుల్ బెడ్రూమ్ కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో ట్రిపుల్ బెడ్రూం కాలనీలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డుల కోసం రెండు వేల మందికి మాత్రమే ఆమోదం జరిగిందని, మిగిలిన 24 వేల మంది జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అల్లం పేర్కొన్నారు. -
సాక్షి రిపోర్టరుకు ప్రెస్ అకాడమీ నగదు బహుమతి
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఎన్కౌంటర్ నిందితుల ఫొటోలను అర్వపల్లి మండలంకు చెందిన సాక్షి పత్రిక రిపోర్టరు వెంకన్న ప్రాణాలకు తెగించి శనివారం సేకరించిన విషయం తెలిసిందే. ఆయన ధైర్యసాహసాలకు గుర్తుగా తెలంగాణ ప్రెస్ అకాడమీ తరపున రూ. 15 వేలనగదు బహుమతిని అందించనున్నట్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోత్సాహకాన్ని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా అందివ్వనున్నట్లు జనరల్ సెక్రటరీ క్రాంతి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో సాహసోపేతమైన జర్నలిజానికి ప్రతీకగా నిలిచిన వెంకన్నకు టీయూడబ్ల్యూ ద్వారా రూ.10వేల అవార్డును సైతం ప్రకటించారు. -
రేపు మధ్యాహ్నం ప్రెస్ అకాడమీకి కేసీఆర్
తెలంగాణ సచివాలయంలోకి మీడియా రాకుండా ఆంక్షలు విధించే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ విషయం చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమికీ వెళ్లనున్నారు. ఆయన.. అక్కడ ప్రెస్ అకాడమీ ఛైర్మన్, ఇతర జర్నలిస్టు సంఘాలతో మాట్లాడనున్నారు. సచివాలయంలో మీడియాకు ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ చెప్పడంతో నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. -
'జర్నలిస్టుల జీవితాలు ఇంకా చీకట్లోనే'
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ జర్నలిస్టుల జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో మంగళవారం జరిగిన కాకతీయ ప్రెస్‌క్లబ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అల్లం నారాయణ, శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కనీస వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక నేటికీ దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వారందరికీ నివేశన స్థలాలు అందించాలని వారం రోజుల క్రితమే ములుగు ఆర్డీఓ మహేందర్‌జీకి ఆదేశాలు జారీ చేశానన్నారు. అనంతరం కాకతీయ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, స్పీకర్ మధుసూదనాచారిని ఘనంగా సన్మానించారు. అలాగే డైరీ ఆవిష్కరణకు సహకరించిన టీబీజీకెఎస్ నాయకుడు మంగళగిరి అప్పయ్యదాస్, 9వ వార్డు కౌన్సిలర్ శిరుప అనిల్‌కుమార్‌ను సన్మానించారు. టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రమణ, నాయకులు బీఆర్ లెనిన్, ఇస్మాయిల్, జిల్లా అధ్యక్షుడు కక్కెర్ల అనిల్‌కుమార్, నాయకులు సుధాకర్, నవాబ్, భూపాలపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, చంద్రు శ్రీధర్ పాల్గొన్నారు. -
జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా
సంగారెడ్డి మున్సిపాలిటీ: జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ప్రెస్ అకాడమీ నిర్ణయించిందని, ఈ నెల 10లోగా జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జర్నలిస్టులందరికీ ఉచిత ప్రమాద బీమా కల్పించాలని ప్రెస్ అకాడమీ చెర్మైన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రమాద బీమా కోసం చెల్లించే ప్రీమియాన్ని రాష్ట్ర కమిటీ భరిస్తుందన్నారు. జిల్లాలోని జర్నలిస్టులంతా తమ నియోజకవర్గంలోని టీయూడబ్ల్యూజే, టీఈఎంజేయూ బాధ్యులను సంప్రదించి దరఖాస్తు ఫారాలు తీసుకోవాలన్నారు. బీమా కోసం ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టు ల పిల్లలకు అన్ని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కలెక్టర్ జీఓ విడుదల చేసినట్లు ఐజేయూ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మినుపూర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక టీఎన్జీఓ భవన్లో జీఓ కాపీలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జీఓ విడుదలకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. -
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం
- మంత్రి తన్నీరు హరీష్‌రావు - టీయూడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక సంగారెడ్డి రూరల్: జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని హైదరాబాద్ ఫంక్షన్ హాల్లో బుధవారం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్’ జిల్లా మహాసభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్ట్‌లు భాగస్వాములయ్యారని కొని యాడారు. జర్నలిస్ట్‌ల సమస్యల పరి ష్కారం, డిమాండ్ల సాధన, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లు కొవ్వొత్తుల్లాంటి వారని తాము కరిగిపోతూ సమాజానికి వెలుగునిచ్చేవారని తెలిపా రు. తమపై యాజమాన్యాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యమ తీరును తెలియజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటిలో జర్నలిస్ట్‌లకు స్థానం కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అక్రెడిటేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జర్నలిస్ట్‌లు రాసే వార్తలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండాలని, ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి మాత్రమే ఉందని తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడు తూ.. ఉద్యమ పోరాటంలో ముందుండి జర్నలిస్ట్‌లు పోరాటంలో నెత్తురు చిందించారన్నారు. 2001లో టీయూడ బ్ల్యూ జేను స్థాపించామని, తమ యూనియన్‌పై ఇతర యూనియన్ కుట్రలు కుతంత్రాలు చేస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై పోరా డి పరిష్కరించాలని సూచించారు. హైదరాబాద్‌పై గవర్నర్ గిరీని వ్యతిరేకిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో వంద చోట్ల ధర్నాలు చేశామని గుర్తుచేశారు. జర్నలిస్ట్ లందరికి ఇళ్ల స్థలాలు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అందజేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో భాగస్వామ్యులైన జర్నలిస్ట్‌లు భవిష్యత్‌లో తెలంగాణ పున ర్ నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రికేయుల అభివృద్ధికి సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడు తమ యూనియన్ అండగా ఉంటుందని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచే సే జర్నలిస్ట్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవి, కార్యదర్శి అబ్దుల్లా, భిక్షపతి, జానకీరామ్, సాగర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. -
సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే
ఇప్పటికైనా బయటపడితే మంచిది సాంస్కృతిక ఆధిపత్యం సినిమాతోనే మొదలైంది ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బంజారాహిల్స్: సినిమా ప్రభావశీల మాధ్యమమని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణపై సాంస్కృతిక ఆధిపత్యం సినిమా ద్వారానే మొదలైందని తెలి పారు. ఈ పరిశ్రమను శాసిస్తోన్న నాలుగు కుటుంబాల కబంధ హస్తాల నుంచి బయట పడినప్పుడే తెలంగాణ సినిమా మనగలుగుతుందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిలిమ్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ లోగోను అల్లం, వెబ్‌సైట్‌ను సుప్రసిద్ధ దర్శకుడు బి.నర్సింగరావు ఆవిష్కరించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ సినిమాకు మన భాష, యాస, ప్రవర్తనలను మార్చగలిగే శక్తి ఉందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతూ సినిమాలు రూపొందించడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. మాభూమి వంటి సినిమాలను చూస్తే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు సినీ రంగంలో విషనాగులు ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సినీ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తి, టీఈఎంజేయూ అధ్యక్షుడు రమణ, టి దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీధర్, టి ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)