సాక్షి రిపోర్టరుకు ప్రెస్ అకాడమీ నగదు బహుమతి | press academy cash award for sakshi reporter | Sakshi
Sakshi News home page

సాక్షి రిపోర్టరుకు ప్రెస్ అకాడమీ నగదు బహుమతి

Published Sun, Apr 5 2015 4:27 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

press academy cash award for sakshi reporter

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టించిన ఎన్‌కౌంటర్ నిందితుల ఫొటోలను అర్వపల్లి మండలంకు చెందిన సాక్షి పత్రిక రిపోర్టరు వెంకన్న ప్రాణాలకు తెగించి శనివారం సేకరించిన విషయం తెలిసిందే. ఆయన ధైర్యసాహసాలకు గుర్తుగా తెలంగాణ ప్రెస్ అకాడమీ తరపున రూ. 15 వేలనగదు బహుమతిని అందించనున్నట్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 

ఈ ప్రోత్సాహకాన్ని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా అందివ్వనున్నట్లు జనరల్ సెక్రటరీ క్రాంతి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో సాహసోపేతమైన జర్నలిజానికి ప్రతీకగా నిలిచిన వెంకన్నకు టీయూడబ్ల్యూ ద్వారా రూ.10వేల అవార్డును సైతం ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement