4 Years Of YS Jagan Govt: Meeting Held At CR Media Academy, Vijayawada - Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో 31లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరు’

Published Tue, May 30 2023 1:10 PM | Last Updated on Wed, May 31 2023 7:11 PM

4 Years Of Ys Jagan Govt: Meeting Held At CR Media Academy Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల పరిపాలన -  తీరు తెన్నులు అనే అంశంపై సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలపై మేధావులు, సీనియర్ జర్నలిస్టులతో ఈ సమావేశం కొనసాగింది.

ఈ చర్చలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, అధికార భాషా కమిటీ చైర్మన్ విజయబాబు, ఆంధ్రా లయోలా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం.సి.దాస్, ఏఎన్ యూ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు చలపతిరావు, కృష్ణంరాజు, కె.బి.జి. తిలక్, సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, ఏఎన్ యూ జర్నలిజం హెచ్ఓడీ అనిత, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సీఎం జగన్ పాలనపై ప్రముఖ రచయిత రామచంద్రారెడ్డి రాసిన సుపరిపాలన - సుజలాం, సుఫలాం పుస్తకాన్ని ఇందులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార భాష కమిటీ చైర్మన్ విజయబాబు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఆటుపోట్ల మధ్య, ముష్కర మూకల దాడులను తట్టుకుని నాలుగేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీనియర్ అయితే ఎదో చేస్తారని ఇష్టం లేకపోయినా చంద్రబాబును 2014లో ఎన్నుకున్నారని చెప్పారు. ఈనాడు రాతలని ప్రజలు విశ్వసించరని, ఆంధ్రులు ఆవులు తోడేళ్ల గుంపును తరిమికొట్టి 23సీట్లకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.

కొమ్మినేని శ్రీనివాసరావు
మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. "నా 45ఏళ్ల జర్నలిజం జీవితంలో ఇన్ని మార్పులు చూడలేదు, పోర్టుల నిర్మాణం, పాలనా వికేంద్రీకరణలతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది, జగన్ పాలనను నరకంతో పోల్చుతూ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది, పేదలకు స్వర్గం, పెత్తందారులకు నరకంలా ఉందనేది నా అభిప్రాయం. జన్మభూమి కమిటీల వద్దకు కాళ్ళు తిరిగేలా తిరగడం నరకం. ఇంటికే వచ్చి ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం స్వర్గం. జగన్ చేసే సంక్షేమం నరకం.. చంద్రబాబు చేస్తే స్వర్గమా..? అని ప్రశ్నించారు.

రామచంద్రా రెడ్డి
రచయిత రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న జీవ క్రాంతి అనేది గొప్ప పథకమని, రాష్ట్రంలో 31లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చిన నాయకుడు ఎవరూ లేరని కొనియాడారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసూయకు మందు లేదని, మంచిపని చేసేటపుడు ఆటంకపరిచేవారిని ఖండించాలన్నారు.

కృష్ణంరాజు
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ.. కొన్ని వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కప్పి పెడుతున్నాయని మండిపడ్డారు. 9ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 10లక్షల కోట్లు పథకాల రూపంలో ప్రజలకు నగదు బదిలీ చేస్తే.. రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్లలో 2.11లక్షల కోట్లు బదిలీ చేసిందని కొనియాడారు. జీడీపీలో దేశంలోనే ఏపీ నెంబర్.1 స్థానంలో ఉందని తెలిపారు.

ఎంవీఎస్ నాగిరెడ్డి
అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సంక్షేమ పాలనకు ఆ రోజు పావురాలగుట్టలో ఇచ్చిన మాటతోనే పునాది పడింది, 2004లో వైఎస్సార్ సంక్షేమాన్ని అమలు చేసారు, అనంతరం వచ్చిన ఎన్నికల్లో కూటమితో వచ్చి చంద్రబాబు ఓటమి పాలయ్యారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే మళ్లీ ఎన్నికలకు రాను అని జగన్ అన్నారు. నాలెడ్జబుల్ గా ఏ సలహా ఇచ్చినా జగన్ స్వీకరిస్తారు, హార్టికల్చర్ హబ్ గా ఏపీ తయారైంది, డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. పేదవాళ్ల కోసం పనిచేసేవాడే కామ్రేడ్ అయితే నేనే పెద్ద కామ్రేడ్ అని వైఎస్సార్ అన్నారు. ఈ రోజు కమ్యూనిస్టులు ఎవరికోసం పని చేస్తున్నారు? మరోసారి అవకాశమిస్తే 2014 నుండి 2019 మాదిరిగా పాలిస్తానని చంద్రబాబు చెప్పగలరా.? మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చంద్రబాబు చెప్పగలరా.? భారతదేశంలో జరిగిన అతిపెద్ద మోసం 2019ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ. రైతులు ఇచ్చిన 12లక్షల గ్రీవెన్స్ ను పక్కన పడేసారని అన్నారు. 

ఎంసీ దాస్
ఆంధ్రా లయోలా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ.. వైఎస్సార్ లయోలా కళాశాల విద్యార్థి అని చెప్పారు. YSR కుమారుడిని నేను జగన్ ను పొగడను.. ఆశీర్వదిస్తాను, GDP గ్రోత్ విషయంలో దేశంలోనే AP మొదటిస్థానంలో ఉంది, సముద్ర తీరాన్ని, నదులను వినియోగించటంలో రెండోస్థానంలో ఉంది, వ్యవసాయ రంగంలో 13శాతం, పారిశ్రామిక రంగంలో 16శాతం వృద్ధిని ఏపీ సాధించింది, కోకో, మాంగో, పాపాయి, రెడ్ చిల్లి ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని గుర్తు చేశారు. చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే దేశంలోనే కాదు ఆసియాలోనే ఏపీ నెం.1 అవుతుందని, సీఎం జగన్ చేస్తున్న హ్యూమన్ రిసోర్స్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా ఉత్పాదక శక్తి పెరుగుతుందని తెలిపారు. అప్పులు తగ్గి ఆదాయం పెరిగితే ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మరింత సంక్షేమాన్ని ఇస్తారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement