
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన 1,603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మీడియా అకాడమీ చరిత్రలో ఇంత పెద్దఎత్తున సాయం అందించడం ఒక మైలు రాయిగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వైద్య, మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు.
కరోనా సోకిన జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్, గుర్తింపు కార్డు, పాజిటివ్ వచ్చిన ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలను పంపడంతో వారికి ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఇంకా కరోనా బారిన పడిన జర్నలిస్టులు ఉంటే తమ వివరాలను పంపాలని, వివరాలకు 80966 77444, 96766 47807లను సంప్రదించవచ్చని సూచించారు. సమావేశంలో అకాడమీ కార్యదర్శి డీఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.