
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 442 మంది పాత్రికేయులకు రూ.80 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. వివరాలకు తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ నెంబర్ 8096677444 లేదా మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్‌కుమార్ సెల్ నెంబర్ 9676647807ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment