సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే | Four families ruling Tollywood Industry, says allam Narayana | Sakshi
Sakshi News home page

సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే

Published Thu, Jul 24 2014 8:43 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే - Sakshi

సినీ పరిశ్రమను శాసిస్తోంది ఆ నాలుగు కుటుంబాలే

  •      ఇప్పటికైనా బయటపడితే మంచిది
  •      సాంస్కృతిక ఆధిపత్యం సినిమాతోనే మొదలైంది
  •      ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
  • బంజారాహిల్స్: సినిమా ప్రభావశీల మాధ్యమమని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణపై సాంస్కృతిక ఆధిపత్యం సినిమా ద్వారానే మొదలైందని తెలి పారు. ఈ పరిశ్రమను శాసిస్తోన్న నాలుగు కుటుంబాల కబంధ హస్తాల నుంచి బయట పడినప్పుడే తెలంగాణ సినిమా మనగలుగుతుందని చెప్పారు.

    బుధవారం హైదరాబాద్‌లోని ఫిలిమ్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిమ్ జర్నలిస్టు అసోసియేషన్ లోగోను అల్లం, వెబ్‌సైట్‌ను సుప్రసిద్ధ దర్శకుడు బి.నర్సింగరావు ఆవిష్కరించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ సినిమాకు మన భాష, యాస, ప్రవర్తనలను మార్చగలిగే శక్తి ఉందన్నారు.

    తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతూ సినిమాలు రూపొందించడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. మాభూమి వంటి సినిమాలను చూస్తే తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు సినీ రంగంలో విషనాగులు ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సినీ నటులు, దర్శకులు ఆర్.నారాయణమూర్తి, టీఈఎంజేయూ అధ్యక్షుడు రమణ, టి దర్శకుల సంఘం అధ్యక్షులు శ్రీధర్, టి ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

    (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement