రాంచీ: కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బాధ్యతలకు తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక వ్యవహారాల బోర్డ్ (పీఈఎస్‌బీ) ఏడుగురు అధికారులను ఇంటర్వ్యూ చేసి పీఎం ప్రసాద్ పేరును సిఫారసు చేసింది. ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫారసుకు ప్రధాని అధ్యక్షతన గల కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.
ప్రసాద్ ప్రస్తుతం రాంచీ కేంద్రంగా పనిచేస్తున్న కోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) సీఎండీగా పనిచేస్తున్నారు. 2019లో ఆయన భారత్ కోకింగ్ కోల్ (బీసీసీఎల్) సీఎండీగా కూడా ఎంపికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఈ మైనింగ్‌లో గ్రాడ్యుయేటింగ్ తదుపరి 1984లో ఆయన సీఐఎల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అటు తర్వాత అంచెలంచెలుగా విభిన్న హోదాల్లో పనిచేస్తూ, కోల్ ఫీల్డ్స్‌లోని వివిధ రంగాల్లో అపార అనుభవాన్ని గడించారు.
Comments
Please login to add a commentAdd a comment