Jabardasth Comedian Punch Prasad Suffering With Kidney Failure, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Punch Prasad Health: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్‌, నడవలేని స్థితిలో..

Published Fri, Nov 18 2022 2:10 PM | Last Updated on Fri, Nov 18 2022 4:40 PM

Jabardasth Comedian Punch Prasad Suffering With Kidney Failure - Sakshi

తనదైన కామెడీ, పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్‌ ప్రసాద్‌ నిజ జీవితంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు. కాగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో ప్రసాద్‌ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. తనదైన స్పాంటేనిటి పంచ్‌లతో ‘పంచ్‌’ ప్రసాద్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకున్న వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్‌లో వాడి అందరిని నవ్వించాడు. 

చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్‌ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక

ఎప్పుడు ఏ షోలో కనిపించినా ఫుల్ కామెడీ చేస్తూ కడుబ్బా నవ్వించే ప్రసాద్‌ను గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య వేధిస్తోంది. అయినా సరే షోల్లో యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ వస్తున్నాడు. ప్రతివారం డయాలసిస్ చేసుకుంటున్నా సరే తన బాధను బయటకు చెప్పకుండా నవ్వించాడు. అలాంటి పంచ్‌ ప్రసాద్‌ పరిస్థితి ప్ర​స్తుతం దారణంగా మారింది. కనీసం నడలేవని స్థితిలో అతడు ఉన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ చానల్‌ షేర్‌ చేసిన వీడియోలో పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర నొప్పితో బాధపడుతూ కనీసం లేవలేని స్థితిలో కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంచ్ ప్రసాద్ యూట్యూబ్ చానల్‌లో కమెడియన్ జోడీ నూకరాజు వ్లాక్‌ చేసి ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు.

చదవండి: నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న రష్మిక మూవీ! అప్పటి నుంచి స్ట్రీమింగ్‌?

ఇందులో తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పేందుకు పంచ్‌ ప్రసాద్‌ ఇష్టం చూపించలేదు. అయినా చాటుగా ఈ వీడియో తీసి ఆయన ఆరోగ్య పరిస్థిని చూపించాడు నూకరాజు. ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రసాద్‌కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసినట్లు నూకరాజు చెప్పుకొచ్చాడు. అభిమానులు కూడా ప్రసాద్‌కి సపోర్ట్ చేయాలని కోరాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement