
వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, ఆయన మేనేజర్ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రసాద్ ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమా నిర్మించారు. ఆయనకు భార్య పద్మజ, కుమార్తెలు సాయి ప్రణీత, సత్య ప్రజీత ఉన్నారు. ప్రసాద్ మరణ వార్త విన్న సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను ఏ కాస్త నిరుత్సాహంలో ఉన్నా ప్రసాద్‌తో మాట్లాడగానే ఎనర్జీ వచ్చేది. తన మరణం నాకు చాలా లోటు. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’’ అంటూ ప్రసాద్ కుటుంబానికి సుకుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.