
కుల్మీత్ మక్కర్
ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ శుక్రవారం ఉదయం గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ‘‘ఈ రోజు (శుక్రవారం) మా అందరికీ ఎంతో బలమైన కుల్మీత్‌గారిని మేం కోల్పోయాం. ఆయన లేని లోటు తీరనిది. సినిమాల పట్ల ఆయనకు ఉన్న తపన, అంకితభావం చాలా గొప్పవి. క్లిష్టమైన సమస్యను సైతం ఆయన ఓ ప్రత్యేక విధానంలో సులభంగా పరిష్కరించేవారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి కుల్మీత్‌గారు అందించిన సేవలు ఆయన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి’’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ఫర్హాన్ అక్తర్, హన్సల్ మెహ్‌తా వంటి బాలీవుడ్ ప్రముఖులు కుల్మీత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment