television producer
-
కుల్మీత్ కన్నుమూత
ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ శుక్రవారం ఉదయం గుండెపోటు కారణంగా కన్నుమూశారు. ‘‘ఈ రోజు (శుక్రవారం) మా అందరికీ ఎంతో బలమైన కుల్మీత్గారిని మేం కోల్పోయాం. ఆయన లేని లోటు తీరనిది. సినిమాల పట్ల ఆయనకు ఉన్న తపన, అంకితభావం చాలా గొప్పవి. క్లిష్టమైన సమస్యను సైతం ఆయన ఓ ప్రత్యేక విధానంలో సులభంగా పరిష్కరించేవారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి కుల్మీత్గారు అందించిన సేవలు ఆయన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి’’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ఫర్హాన్ అక్తర్, హన్సల్ మెహ్తా వంటి బాలీవుడ్ ప్రముఖులు కుల్మీత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. -
బుల్లితెర నిర్మాతపై దాడి..!
బంజారాహిల్స్: ప్రతినెల రెండవ ఆదివారం టీవీ షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు. అయినా ఓ టీవీ నిర్మాత మాత్రం షూటింగ్ నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ లోకేషన్‌కు వెళ్లి నిర్మాతపై దాడి చేయడమే కాకుండా సెట్లో విద్వంసం సృష్టించారంటూ ఎనిమిదిమంది టీవీ కార్మికులు, ఆర్టిస్ట్‌లపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలు..... రామ సీత అనే టీవీ సీరియల్ షూటింగ్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో ఆదివారం ఉదయం జరుగుతుండగా సెలవు రోజున కూడా షూటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ టీవీ ఫెడరేషన్ నాయకులు దాడికి పాల్పడ్డారు. చక్రి అనే వ్యక్తితో పాటు రాజేందర్‌సింగ్, నాగరాజు, విజయ్‌యాదవ్, నర్సింగ్‌యాదవ్ తదితరులు దాడి చేసారంటూ నిర్మాత పులి వాసు , కోడైరెక్టర్ జయకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈమేరకు వీరందరిపై పోలీసులు ఐపీసీ 323, 341,327, 506 తదితర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.