బంజారాహిల్స్: ప్రతినెల రెండవ ఆదివారం టీవీ షూటింగ్‌లకు సెలవు ప్రకటించారు. అయినా ఓ టీవీ నిర్మాత మాత్రం షూటింగ్ నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ లోకేషన్‌కు వెళ్లి నిర్మాతపై దాడి చేయడమే కాకుండా సెట్‌లో విద్వంసం సృష్టించారంటూ ఎనిమిదిమంది టీవీ కార్మికులు, ఆర్టిస్ట్‌లపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
వివరాలు..... రామ సీత అనే టీవీ సీరియల్ షూటింగ్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో ఆదివారం ఉదయం జరుగుతుండగా సెలవు రోజున కూడా షూటింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ టీవీ ఫెడరేషన్ నాయకులు దాడికి పాల్పడ్డారు. చక్రి అనే వ్యక్తితో పాటు రాజేందర్‌సింగ్, నాగరాజు, విజయ్‌యాదవ్, నర్సింగ్‌యాదవ్ తదితరులు దాడి చేసారంటూ నిర్మాత పులి వాసు , కోడైరెక్టర్ జయకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈమేరకు వీరందరిపై పోలీసులు ఐపీసీ 323, 341,327, 506 తదితర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బుల్లితెర నిర్మాతపై దాడి..!
Published Tue, Jun 13 2017 9:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement