ఓ మహిళపై దాడి చేసిన పలువురిపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు.
ఓ మహిళపై దాడి చేసిన పలువురిపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని సంతోష్‌నగర్‌లో ప్రేమకుమారి నివాసముంటుంది. ఇటీవల ఆమె తన ఇంటి ఆవరణలో నూతన నిర్మాణాలను ప్రారంభించింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 50 మంది వచ్చి ఆమెపై దాడి చేయడమే కాకుండా నూతన నిర్మాణాన్ని కూల్చివేసి సామగ్రిని చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలువురిపై అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.