Prema kumari
-
ఎమ్మెల్యే ప్రియురాలి హల్చల్
మైసూరు: ఎన్నికల సమయంలో హంగామా సృష్టించిన ఎమ్మెల్యే రామదాసు ప్రియురాలుగా వార్తల్లోకెక్కిన ప్రేమకుమారి గురువారం హఠాత్తుగా ఎమ్మెల్యే రామదాసు కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యారు. మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే రామదాసు తన భర్తని తాను బతికి ఉన్నంత కాలం రామదాసుతోనే కలసి జీవిస్తానంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకొన్నామని అయితే ఎన్నికల ఫలితాల వెలువడినప్పటి నుంచి రామదాసు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపించారు. అందుకే ఇవాళ తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చామని రామదాసుకు పట్టిన దెయ్యాన్ని విడిపిస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. -
రామదాసుపై పోటీ చేస్తా
మైసూరు : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఏ.రామదాస్‌పై వచ్చే శాసన సభ ఎన్నికల్లో మైసూరు నగరంలో ఉన్న కే.ఆర్.నగర నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేస్తానని ప్రేమకుమారి తెలిపారు. గతంలో ఆమె మాజీ మంత్రి రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే ఉండటంతో ఇప్పటికే కే.ఆర్. నగర నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మాజీ మంత్రి రామదాసు తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ఇటీవలె నియోజకవర్గంలో చెత్త సమస్యపై ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. ఎన్నికల కోసం రామదాసు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ప్రస్తుతం తెరపైకి వచ్చిన ప్రేమకుమారి మరోసారి రామదాస్‌కు షాక్ ఇచ్చారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి అయినా లేదా స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి కచ్చితంగా నిలబడతానని చెప్పారు. నటుడు ఉపేంద్ర పార్టీ లేదా అనుపమా శైనె పార్టీ నుంచి పోటీ చేయడానికి యత్నిస్తున్నానని చెప్పారు. -
మహిళపై దాడి: పలువురిపై అట్రాసిటీ కేసు
ఓ మహిళపై దాడి చేసిన పలువురిపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లోని సంతోష్‌నగర్‌లో ప్రేమకుమారి నివాసముంటుంది. ఇటీవల ఆమె తన ఇంటి ఆవరణలో నూతన నిర్మాణాలను ప్రారంభించింది. ఈక్రమంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు 50 మంది వచ్చి ఆమెపై దాడి చేయడమే కాకుండా నూతన నిర్మాణాన్ని కూల్చివేసి సామగ్రిని చిందరవందరగా పడేశారు. విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలువురిపై అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
రామ @ ప్రేమ
* వివాదంలో మాజీ మంత్రి రామదాస్ * తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ మహిళ ఆరోపణ * మంత్రిగా ఉన్నప్పుడి నుంచే ప్రేమాయణం * తనను బహిరంగంగా వివాహం చేసుకోవాలని డిమాండ్ * కలత చెందిన రామదాస్ ఆత్మహత్యాయత్నం * సకాలంలో ఆస్పత్రికి తరలింపు.. తప్పిన ముప్పు * ఆత్మహత్యాయత్నంపై విభిన్న కథనాలు మైసూరు, న్యూస్‌లైన్ : ఆయన బ్రహ్మచారి. గత బీజేపీ హయాంలో వైద్య విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓ మహిళ హఠాత్తుగా ఆయనపై ‘బాంబు’ లాంటి ఆరోపణలు పేల్చడంతో ఖిన్నుడయ్యారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మాజీ మంత్రి ఎస్ఏ. రామదాస్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నారని చిక్కమగళూరుకు చెందిన ప్రేమ కుమారి (35) మంగళవారం ఇక్కడ ఆరోపించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మరణించాడు. తమకూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లర్కుగా పని చేస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బదిలీ విషయమై తరచూ వెళ్లానని, క్రమేపీ తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆమె వివరించింది. అందరి సమక్షంలో రామదాస్ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలతో కలత చెందిన రామదాస్ మంగళవారం రాత్రి ఇక్కడి గోకులంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన సహాయకుడు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. బెంగళూరుకు తరలించాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. ఆస్పత్రిలో ఆయనను అనేక మంది బీజేపీ నాయకులు పరామర్శించారు. కాగా రామదాస్ ఆత్మహత్యాయత్నంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మద్దతుదారుని ఆత్మహత్య తమ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుసుకున్న రామదాస్ మద్దతుదారుడు నవీన్ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను స్థానిక విద్యారణ్యపురానికి చెందిన వాడు. మరో వైపు ప్రేమ కుమారి బాగోతంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె ఇదివరకే ఓ విలేజ్ అకౌంటెంట్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉండేదని, బ్లాంక్ చెక్కు తీసుకుని అతనిని మోసం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.