
మైసూరు: ఎన్నికల సమయంలో హంగామా సృష్టించిన ఎమ్మెల్యే రామదాసు ప్రియురాలుగా వార్తల్లోకెక్కిన ప్రేమకుమారి గురువారం హఠాత్తుగా ఎమ్మెల్యే రామదాసు కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యారు. మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యే రామదాసు తన భర్తని తాను బతికి ఉన్నంత కాలం రామదాసుతోనే కలసి జీవిస్తానంటూ స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కూడా రామదాసు కోసమే పోటీ నుంచి తప్పుకొన్నామని అయితే ఎన్నికల ఫలితాల వెలువడినప్పటి నుంచి రామదాసు తమకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆరోపించారు. అందుకే ఇవాళ తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చామని రామదాసుకు పట్టిన దెయ్యాన్ని విడిపిస్తానంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment