వైఎస్‌ జగన్‌: హీనమైన చరిత్ర టీడీపీది | YS Jagan Speech About SC Commission Bill - Sakshi Telugu
Sakshi News home page

టీడీపీది హీనమైన చరిత్ర : సీఎం జగన్‌

Published Tue, Jan 21 2020 1:54 PM | Last Updated on Tue, Jan 21 2020 4:35 PM

AP CM YS Jagan Explained SC Commission Bill During Assembly Session - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని, ఇది విపక్షనేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే సభలో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, అయిదుగురు ఉప ముఖ్యమంత్రులలో ఇద్దరు ఆ వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీసి లబ్ధి పొందాలని చూశారని సీఎం ఆక్షేపించారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం మరోసారి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పలువురు సభ్యుల మాట్లాడిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

టీడీపీది దిక్కుమాలిన చరిత్ర   
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసే చరిత్రాత్మక బిల్లును గతంలో శాసన మండలిలో ఆమోదం పొందకుండా చేసిన దిక్కుమాలిన చరిత్ర తెలుగు దేశం పార్టీది అని, ఇదీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేల వైఖరి అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. దీంతో మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టామని, ఈసారి మండలిలో అడ్డుకోవడం సాధ్యం కాదు కాబట్టి, సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ విధంగా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విపక్షం వ్యవహరిస్తోందని తెలిపారు.

మూడు కార్పొరేషన్లు   
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. మాల, మాదిగతో పాటు, రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ అదే ఎస్సీలను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు కుట్ర చేశారని, వారిని విభజించి పాలించాలని దుర్భుధ్ధితో వ్యవహరించారని ఆక్షేపించారు. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్‌కు తలొగ్గాల్సి వస్తుందన్న దుర్భుద్ధితో వారిని విడగొట్టాలని చంద్రబాబు అడుగులు వేశారని ఆరోపించారు. దాన్ని సరిచేస్తూ, ఎస్సీలంతా ఒక్కటై ఉండాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

మరింత మేలు చేసేలా..   
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేంగా వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయాలని ప్రయత్నిస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రస్తావించిన ఆయన, వాటిలో రెండు మినహా అన్నింటినీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెల్చుకుందని గుర్తు చేశారు. టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు గెలిచారని తెలిపారు. కాగా, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే, తాము చేస్తున్న మంచి పనులు చూసి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తమకు ఉన్న ఏకైక సభ్యుడిని ముందు పెడుతున్న టీడీపీ, రాజకీయం చేస్తోందని, ఆయన వైఖరి చూస్తుంటే ఎందుకు గెలిపించామని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య పోస్టులు   
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 6 మంత్రి పదవులు ఇచ్చామన్న సీఎం వైఎస్‌ జగన్, వారిలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. ఇంకా కీలకమైన విద్యా మంత్రి, హోం మంత్రి కూడా ఎస్సీలని, దీన్ని గర్వంగా చెప్పగలమని అన్నారు. ఇదే కాకుండా ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. ఆ విధంగా ఎస్సీలను ముఖ్యమైన పదవుల్లో నియమించామని వివరించారు.

ఇప్పుడైనా మద్దతు ఇవ్వండి
వీటన్నింటితో పాటు, ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, గతంలో ఆ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకుందని, కాబట్టి శాసనసభలో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

చదవండి:

‘సీఎం జగన్‌కు గిరిజనుల తరుపున ధన్యవాదాలు’

ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?

సంక్షేమ పథకాలు వదిలేద్దామా!

రాజధానులిక అందరివీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement