సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు.
‘సీఎం జగన్ రూ.2లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు.నాయకత్వం అంటే సీఎం జగన్‌ది.మేనిఫెస్టోలోని ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారు.
సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గింది. కరోనా కష్టకాలంలో కూడా పేదవాడికి తోడుగా సీఎం జగన్ నిలబడ్డారు. అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది కనుకనే ఈరోజు ధైర్యంగా చెప్పుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
‘పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చంద్రబాబుకు కడుపుమంట. రాజకీయమే అజెండాగా చంద్రబాబు ప్రవర్తిస్తుంటారు. మాటలతో మభ్యపెట్టే చంద్రబాబుని ప్రజలు నమ్మరు. చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? చంద్రబాబు చెప్పుకునేందుకు ఓ మంచి పథకం ఉందా?. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు’ అని శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment