సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం బుధవారం(ఆగస్టు14) ఢిల్లీలో కలిసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద టీడీపీ శ్రేణుల దాడిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు నేతలు కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు, సీసీ కెమెరాలు ఆపేసి అంబేద్కర్ విగ్రహంపై దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీకమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఏ. సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎంఎల్సీ అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులున్నారు. కమిషన్ చైర్మన్‌ను కలిసి బయటికి వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడారు.
అంబేద్కర్ సిద్ధాంతాలపై దాడి: గురుమూర్తి,ఎంపీ
- జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానను కలిశాం
- అంబేద్కర్ విగ్రహం పై దాడి అంటే ఆయన సిద్ధాంతాలపై దాడి
- ఇది దళిత సమాజాన్ని అవమనపరచడమే
- ఈ ఘటనపై ఎస్సీ కమిషన్ దర్యాప్తు చేయాలి
ఓర్వలేకపోతున్నారు: మేరుగ నాగార్జున, మాజీ మంత్రి
- అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఓర్వ లేక పోయారుపలుగులు, గుణపాలతో పొడిచి దాడి చేశారు.
- దీనిపై చర్యలు తీసుకోవాలని ధర్నాలు, నిరసనలు చేశాం.
- కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.ఎవరిపైనా కేసు పెట్టలేదు.
- పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు.
- అందుకే ఎస్సీ కమిషన్ ను కలిసి పరిస్థితి వివరించాం.
- చంద్రబాబు ప్రభుత్వం పై నమ్మకం లేదు.
- కేంద్ర బలగాలతో అంబేద్కర్ విగ్రహానికి భద్రత కల్పించాలి.
- రెండు నెలల నుంచి రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి.
- వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- అంబేద్కర్ విగ్రహం నిలబెట్టిన వేదికను పగలగొడితే దాడి కాదా ?
త్వరలో ఏపీకి ఎస్సీ కమిషన్: ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి
- టీడీపీ నాయకుల ప్రోద్బలంతో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది.
- దాడిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు.
- వైఎస్ జగన్ పేరు తీసేస్తే.. చెరిగిపోయే పేరు జగన్‌ది కాదు.
- ఏపీ ప్రజల గుండె చప్పుడు వైఎస్ జగన్.
- రెండునెలల నుంచి జరుగుతున్న దాడులకు పరాకాష్ట అంబేద్కర్ విగ్రహం పై దాడి
- త్వరలోనే ఎస్సీ కమిషన్ ఏపీకి వస్తుంది.
- విగ్రహానికి కేంద్ర బలగాల భద్రత కల్పించాలి.
- పోలీసుల నిర్లక్ష్యం పై విచారణ జరపాలి.
- ప్రాణాలు అడ్డుపెట్టి విగ్రహాన్ని కాపాడుతాం.
ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు: నందిగం సురేష్, మాజీ ఎంపీ
- అంబేద్కర్ విగ్రహం దాడి చేస్తే టీడీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
- ఎస్సీ కమిషన్ కు అన్ని వివరించాం.
- దాడులు చూస్తే ఏపీ అంటేనే జనం హడలిపోతున్నారు.
- ఏపీని చంద్రబాబు అరాచకం వైపు నడిపిస్తున్నారు.
- బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలెక, దాడులకు పాల్పడుతున్నారు.
- దాడులకు భయపడేది లేదు.
- రెండు నెలలో టీడీపీ ఓటు బ్యాంకు అయిదు శాతం పడిపోయింది.
- దాడులు జరిగితే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి?
Comments
Please login to add a commentAdd a comment