
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో అట్రాసిటీ చట్టం అమలుపై నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 478 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు మంత్రి పేర్కొంటూ వీటిని పునఃసమీక్షించాలన్నారు. అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను నిరో ధించేందుకు పీసీఆర్, పీవోఏ చట్టాలకు పదును పెట్టాలని మంత్రి కోరారు.
రాష్ట్రంలో ఐదుగురు సభ్యులతో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. 79 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసిందని, స్టేమీద ఉన్న మరో 37 కేసుల్లో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్దేశంతో స్టే రద్దవుతుందని మంత్రి వివరించారు. అట్రాసిటీ చట్టం అమలును పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment