Atrocity Act
-
అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో అట్రాసిటీ చట్టం అమలుపై నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 478 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు మంత్రి పేర్కొంటూ వీటిని పునఃసమీక్షించాలన్నారు. అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను నిరో ధించేందుకు పీసీఆర్, పీవోఏ చట్టాలకు పదును పెట్టాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఐదుగురు సభ్యులతో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. 79 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసిందని, స్టేమీద ఉన్న మరో 37 కేసుల్లో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్దేశంతో స్టే రద్దవుతుందని మంత్రి వివరించారు. అట్రాసిటీ చట్టం అమలును పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. -
‘న్యాయవ్యవస్థ అగ్రకులాలతో నిండిపోయింది’
సాక్షి, సూర్యాపేట: న్యాయవ్యవస్థ అంతా అగ్రకులాలతో నిండిపోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ఒక్క దళిత, గిరిజనులు సుప్రీంకోర్టు జడ్జీలు కాలేకపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలను బలహీనం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకే అట్రాసిటీ చట్టంలో ఉన్న పదునైన కోరలను తొలగించేందుకు కుట్ర జరిగిందన్నారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేసుందుకే ముందస్తుగా ఈ యాక్ట్‌ను బలహీనపరిచే కుట్రలను కేంద్రం చేయకుండా.. సుప్రీం కోర్టు ద్వారా చేయించిందని ఆయన విమర్శించారు. -
గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన రాహుల్
-
ఆందోళనకు దిగిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళనకు దిగారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పార్లమెంటు భవనం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ఎస్సీ/ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటి) యాక్ట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కొంతమంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, బాధ్యతగల ఉద్యోగులను సైతం ఈ చట్టం సాయంతో వేధిస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసు నమోదు అయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను నేరుగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో చట్టాన్ని నీరుగార్చే చర్యలు జరుగుతున్నాయని, సుప్రీం తీర్పు అట్రాసిటీ చట్టం బలాన్ని తగ్గించేలా ఉందని, ఈ నేపథ్యంలో సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళితుల హక్కుల సంరక్షణకోసం రాహుల్‌గాంధీ ఎల్లప్పుడూ ముందుంటారని పార్టీ ఎంపీలు, ఇతర మద్దతుదారులు తెలిపారు. -
ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు
అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పెద్దపప్పురు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక రవాణా చేస్తుండగా కులం పేరుతో దూషించారని కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధి సూర్య గత సోమవారం డీఐజీకి ఫిర్యాదు చేశారు. అధికారులు అనుమతి ఇచ్చినా ఇసుక తరలింపును ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారని, తమ ఆశ్రమానికి నీటి సరఫరా నిలిపివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆధ్మాత్మిక సంస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రెడ్డిపై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులపై సత్వర చర్యలు
– జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చిత్తూరు (కలెక్టరేట్) : ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్‌జైన్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే చర్యలు తీసుకుని దోషులకు శిక్ష పడేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. అట్రాసిటీ యాక్టును అమెండ్ చేస్తూ ఇన్విస్టిగేషన్ కాలపరిమితి 30 నుంచి 60 రోజులకు పెంచారని, ఈ లోగా చర్యలు తీసుకుని చార్జీషీటు ఫైల్ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు సబ్ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో ఉంటే సత్వర చర్యల కోసం లేఖ రాయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 26వ తేది మధ్యాహ్నం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో వర్క్‌షాపు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 15 రోజులకు ముందే డివిజన్, మండల స్థాయి కమిటీలను నిర్వహించాలన్నారు. నారాయణవనంలో 30 ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందన్నారు. వారి క్లైయిమ్లకు ఆధారాలు పొంది పట్టాలివ్వాలన్నారు. కార్వేటినగరం చాకలివానిగుంటలో గిరిజనులకు పట్టాలు అందకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టాలు అందని గిరిజనులుంటే వారి క్లైయిములు పరిశీలించి వారికి పట్టాలిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రగిరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, తిరుపతి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, సునీల్‌కుమార్, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, జయలక్ష్మి, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీశాఖల అధికారులు, ఎస్సీ,ఎస్టీల నాయకులు పాల్గొన్నారు. -
అట్రాసిటి కేసుల్ని సత్వరం పరిష్కరించాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారు కోర్టు స్టే తెచ్చుకునే లోపే కేసు పరిష్కరించాలని, ఆ మేరకు చర్యలు వే గవ ంతం చేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో అట్రాసిటీ కేసులు, సబ్‌ప్లాన్ అమలు, భూ సమస్యలపై ఎస్సీ సంఘాలు, సంబంధిత శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అట్రాసిటీ కేసులన్నీ పీఓటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి చార్జీషీటు తయారుచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొందరు అట్రాసిటీ కేసులను నీరుగార్చే యత్నాలు చేస్తున్నారని, అలాంటివాటిపై ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలో 134 కేసులు నమోదు కాగా.. 84 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కేసుల పరిష్కారంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. ఎస్సీ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని, జిల్లాలో అంబేద్కర్పేరున నడుస్తున్న పాఠశాలలపై సమీక్ష నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్‌ను ఆదేశించారు. సమావేశంలో వచ్చిన వినతులపై రెండు వారాల్లో కమిషన్‌కు రిపోర్టు చేయాలన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో 2300 మంది ఎస్సీ లబ్ధిదారులకు రుణాలు అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య, మాజీ మంత్రి పుష్పలీల, దళిత సంఘాల ప్రతినిధులు చెన్నయ్య, అనంతయ్య, రాములు తదితరులు జిల్లాలోని పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఓఎస్డీ సుబ్బారావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్పీ రాజకుమారి, జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.