
ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు
అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పెద్దపప్పురు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇసుక రవాణా చేస్తుండగా కులం పేరుతో దూషించారని కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధి సూర్య గత సోమవారం డీఐజీకి ఫిర్యాదు చేశారు. అధికారులు అనుమతి ఇచ్చినా ఇసుక తరలింపును ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారని, తమ ఆశ్రమానికి నీటి సరఫరా నిలిపివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఆధ్మాత్మిక సంస్థపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రెడ్డిపై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేశారు.