సాక్షి, రంగారెడ్డి జిల్లా: అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన వారు కోర్టు స్టే తెచ్చుకునే లోపే కేసు పరిష్కరించాలని, ఆ మేరకు చర్యలు వే గవ ంతం చేయాలన్నారు.
సోమవారం కలెక్టరేట్లో అట్రాసిటీ కేసులు, సబ్‌ప్లాన్ అమలు, భూ సమస్యలపై ఎస్సీ సంఘాలు, సంబంధిత శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అట్రాసిటీ కేసులన్నీ పీఓటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి చార్జీషీటు తయారుచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొందరు అట్రాసిటీ కేసులను నీరుగార్చే యత్నాలు చేస్తున్నారని, అలాంటివాటిపై ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు.
జిల్లాలో 134 కేసులు నమోదు కాగా.. 84 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కేసుల పరిష్కారంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు. ఎస్సీ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలని, జిల్లాలో అంబేద్కర్‌పేరున నడుస్తున్న పాఠశాలలపై సమీక్ష నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్‌ను ఆదేశించారు. సమావేశంలో వచ్చిన వినతులపై రెండు వారాల్లో కమిషన్‌కు రిపోర్టు చేయాలన్నారు.
కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో 2300 మంది ఎస్సీ లబ్ధిదారులకు రుణాలు అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య, మాజీ మంత్రి పుష్పలీల, దళిత సంఘాల ప్రతినిధులు చెన్నయ్య, అనంతయ్య, రాములు తదితరులు జిల్లాలోని పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఓఎస్‌డీ సుబ్బారావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్పీ రాజకుమారి, జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటి కేసుల్ని సత్వరం పరిష్కరించాలి
Published Tue, Nov 11 2014 1:37 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement