సాక్షి, సూర్యాపేట: న్యాయవ్యవస్థ అంతా అగ్రకులాలతో నిండిపోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ఒక్క దళిత, గిరిజనులు సుప్రీంకోర్టు జడ్జీలు కాలేకపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలను బలహీనం చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకే అట్రాసిటీ చట్టంలో ఉన్న పదునైన కోరలను తొలగించేందుకు కుట్ర జరిగిందన్నారు. భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేసుందుకే ముందస్తుగా ఈ యాక్ట్‌ను బలహీనపరిచే కుట్రలను కేంద్రం చేయకుండా.. సుప్రీం కోర్టు ద్వారా చేయించిందని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment