ఆందోళనకు దిగిన రాహుల్‌ | Led by Rahul, Cong MPs stage protest | Sakshi
Sakshi News home page

ఆందోళనకు దిగిన రాహుల్‌

Published Fri, Mar 23 2018 1:38 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Led by Rahul, Cong MPs stage protest - Sakshi

రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆందోళనకు దిగారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి పార్లమెంటు భవనం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. ఎస్సీ/ఎస్టీ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటి) యాక్ట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

కొంతమంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, బాధ్యతగల ఉద్యోగులను సైతం ఈ చట్టం సాయంతో వేధిస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసు నమోదు అయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను నేరుగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో చట్టాన్ని నీరుగార్చే చర్యలు జరుగుతున్నాయని, సుప్రీం తీర్పు అ‍ట్రాసిటీ చట్టం బలాన్ని తగ్గించేలా ఉందని, ఈ నేపథ్యంలో సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా దళితుల హక్కుల సంరక్షణకోసం రాహుల్‌గాంధీ ఎల్లప్పుడూ ముందుంటారని పార్టీ ఎంపీలు, ఇతర మద్దతుదారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement