చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు | sailajanath complaint SC commission against chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు

Published Thu, Feb 11 2016 1:38 PM | Last Updated on Sat, Jul 28 2018 3:49 PM

చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు - Sakshi

చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు

హైదరాబాద్: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ కమిషన్ కు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టేలా ఆదేశించాలని కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ ధర్నా చేపడుతుందని తెలిపారు.

కాగా, దళితులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement