'సీమకు రావాలసిన రాజధానిని తరలించుకుపోయారు' | S. Sailajanath takes on chandrababu | Sakshi
Sakshi News home page

'సీమకు రావాలసిన రాజధానిని తరలించుకుపోయారు'

Published Fri, Jun 5 2015 1:03 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'సీమకు రావాలసిన రాజధానిని తరలించుకుపోయారు' - Sakshi

'సీమకు రావాలసిన రాజధానిని తరలించుకుపోయారు'

హైదరాబాద్: రాయలసీమకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. శైలజానాథ్ శుక్రవారం హైదరాబాద్లో ఆరోపించారు. రాజధాని అంశాన్ని బాబు తన సొంతింటి అంశంగా నిర్ణయాలు తీసుకుని సీమను మోసం చేశారని విమర్శించారు. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో కేంద్రం రాయలసీమకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ హామీని అమలులో టీడీపీ విస్మరిస్తోందన్నారు.

ఏపీకి కేటాయించిన నదీ జలాల్లో రాయలసీమ వాటా  ఎంతో తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు ప్రయోజనమంటూ ఒట్టి మాటలు చెప్తున్నారన్నారు. తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు సీమకు రావాల్సిన రాజధానిని తరలించుకుపోయారని విమర్శించారు. వరద, భూకంప ప్రాంతాంలో రాజధాని కట్టడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement