సాక్షి, హైదరాబాద్: ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ ట్రేడుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (టీఎస్‌సీసీడీసీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకుండా 18–35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపింది. జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఫేష్ ట్రైనింగ్, పంచకర్మ, ఆయుర్వేద స్పా, రెస్టారెంట్ సర్వీ సులో శిక్షణ ఇస్తామని, శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నామని పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని జాతీయ, పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థలో కానీ జిల్లా ఎస్సీ కో ఆపరేటివ్ సంస్థను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment