జగిత్యాల అర్బన్ : పట్టణ ప్రాంతాల్లోని యువతకువివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పట్టణ జీవనోపాధులుమిషన్ ద్వారా నైపుణ్యాల అభివృద్ధి పాలసీని ప్రారంభించాయి. 2009లో ప్రారంభమైన ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని చేరడంలేదు. సర్కారు సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతుంది.
పట్టణాల్లో అమలు
జిల్లాలోని రెండు కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలు అవుతోంది. అధికారులు లక్షకు పైగా ఉన్న జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. నైపుణ్యాలు కలిగిన సంస్థలకు నిరుద్యోగులను కేటాయించి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్ర ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
శిక్షణపై చిన్నచూపు
పట్టణంలోని పదో తరగతి పాసైన యువతీ, యువకులకు కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్, బ్యూటీథెరపీ, హెయిర్‌స్టైల్‌తోపాటు సుమారు 20 రంగాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ తీసుకోవాల్సిన నిరుద్యోగులు సంబంధిత మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకోవాలి. తమకు ఏ కోర్సుల్లో శిక్షణ కావాలో ముందుగా తెలియజేయాలి. వారి అభ్యర్థన మేరకు ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి మూడు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున 40మందికిశిక్షణ ఇస్తారు. కానీ మెప్మా అధికారులు పట్టణాల్లో ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తులు చేసుకునే వారే కరువయ్యారు. .
నీరుగారుతున్న లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ పథకం లక్ష్యం నీరుగారుతుంది. పట్టణాల్లో కంప్యూటర్ శిక్షణ సెంటర్లు యువతీ, యువకులకు శిక్షణ ఇస్తామని హైదరాబాద్‌లోని మెప్మా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటారు. జిల్లా అధికారులు వాటిని పరిశీలించి శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరు ఎంపిక చేసిన కేంద్రాల్లో యువతకు శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ శిక్షణ ఇచ్చే సెంటర్లకు ఒక విద్యార్థికి రూ.11,500 చెల్లిస్తారు. ఒక్కో సెంటర్‌లో ఒక బ్యాచ్‌కు 40 మందిని కేటాయిస్తారు. ముందుగా శిక్షణ కోసంముందుగా రూ.2200 చెల్లిస్తారు. ఉపాధి లభించిన అనంతరం మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ ఇవన్ని పట్టణంలో ఎక్కడా జరగడం లేదు.
విద్యార్థుల అనాసక్తి
అధికారులు ఉపాధి శిక్షణపై యువతకు తెలియజేయకపోవడంతో దరఖాస్తు చేసుకునేవారు కరువయ్యా రు. తెలిసిన కొంతమంది దరఖాస్తు చేసుకున్న నామ్‌కేవాస్తేగా శిక్షణకు పంపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు మూడు నెలల కోర్సు కు పది రోజులు మాత్రమే వెళ్లి మానేస్తున్నారు.
దీంతో విద్యార్థులకు శిక్షణ లభించడం లేదు. ప్రస్తుతం ఈ శిక్ష ణ ఇచ్చే కంప్యూటర్ సెంటర్లలో బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. విద్యార్థి 30 రోజుల్లో 15 రోజులు కోర్సులకు హాజరు కావాల్సి ఉంటుంది. కోర్సు చేసే విద్యార్థి కచ్చితంగా వచ్చి బయోమెట్రిక్ పాటిస్తేనే హాజరుపడుతుంది. దీంతో విద్యార్థుల హాజరు శాతం లేక కం ప్యూటర్ సెంటర్ల యజమానులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. అధికారులు పూర్తిస్థాయిలో కోర్సుల గురించి అవగాహన కల్పిస్తేనే విద్యార్థుల పూర్తిచేసే అవకాశం ఉంది.
ఉపాధి శిక్షణపై చిన్నచూపు
Published Wed, Jul 6 2016 3:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement