Minister T. Harish Rao
-
‘మైనింగ్’ మంత్రి పేషీకి ‘మట్టి దందా’ !
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణం కోసం రూ.8 కోట్ల విలువ చేసే మట్టి, మొరం తవ్వకాల భాగోతం గనులు, భూగర్భశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేషీకి చేరినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ జరిమానా వేసిన సుమారు రూ. 8 కోట్లను రద్దు చేయాలని కాంట్రాక్టర్లు మంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. ఆర్మూరు-నిజామాబాద్‌ల మధ్య రైల్వేలైను పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం, మట్టి అక్రమంగా తవ్వారు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రేవూరు నారాయణరెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, జీవీఆర్ కన్స్ట్రక్షన్, మిలీనియం కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్ కాంట్రాక్టు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎస్ఈలను బాధ్యులను చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. కాగా, అభివృద్ధి పనుల కోసమే మట్టి తవ్వామని కాంట్రాక్టు సంస్థలు హైకోర్టుకు విన్నవించాయి. రివి జన్ పిటిషన్ సమర్పించిన ఆ సం స్థలు రాజకీయ నేతలతో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జరిమా నా, మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉంది. -
కాళేశ్వరం ఎత్తిపోతలపై దుష్ర్పచారం
సాక్షి, హైదరాబాద్: ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పెదవి విప్పని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ నాయకుడు నర్సిరెడ్డి ఇపుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో బుధవారం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టవద్దనేదే వీరి లక్ష్యమని విమర్శించారు. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వల్ల ఆదిలాబాద్‌కు నష్టమని దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తవ్విన కాల్వలను ఉపయోగించుకుంటాం, ముంపు లేకుండా బ్యారేజీ నిర్మించి నీళ్లిస్తాం. బ్యారేజీ మారినా పాత పద్ధతిని కొనసాగిస్తాం ’ అని మంత్రి అన్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే అదనంగా లక్ష ఎకరాలకు నీరిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత సరిగా లేనందునే కాళేశ్వరాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రాజెక్టు ఖర్చు విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే, ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1,900 కోట్లు ఖర్చు అవుతుందని, అదే కాళేశ్వరం దిగువన 20 కిలోమీటర్ల వద్ద మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీకు రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని హరీశ్ పేర్కొన్నారు. విపక్షాలు అబద్దాలు, గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత -చేవెళ్లపై అప్పటి మహారాష్ట్ర సీఎం అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. చివరకు లగడపాటి రాజగోపాల్ వంటి తెలంగాణ బద్ధ వ్యతిరేకులకూ ఆశ్రయమిచ్చిన షబ్బీర్ అలీ వంటి నాయకులూ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బి.గణేష్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కలను చంటి పిల్లల్లా పెంచండి తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను చంటి పిల్లల్లా సంరక్షించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 150 వ్యవ సాయ మార్కెట్ యార్డుల్లో హరితహారం కార్యక్రమం అమలు తీరుపై బుధవారం వాట్సప్ ద్వారా సమీక్షించారు. ఒక్కో మార్కెట్ యార్డు పరిధిలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. మార్కెట్ యార్డుల వారీగా ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారనే అంశంపై మంత్రి వివరాలు సేకరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జోన్లవారీగా అధికారులు బృందాలుగా ఏర్పడి ఇప్పటి వరకు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలన్నారు. మార్కెట్ యార్డులలో హరితహారం కార్యక్రమం అమలవుతున్న తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. -
బాబు దబాయింపులకు భయపడం: హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు సెక్షన్ 8 అం టూ ఏపీ సీఎం చంద్రబాబు చేసే దబాయిం పులకు భయపడేదిలేదని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటామన్నా, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలంటున్నా.. తెలంగాణ టీడీపీ నేతలు రమణ, ఎర్రబెల్లి ఎందుకు నోరుమెదపటం లేదని ప్రశ్నించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌పై చం ద్రబాబు ఆటలు సాగనివ్వబోమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10 వేల కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలి పారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి పాల్గొన్నారు. -
299 టీఎంసీలనూ వినియోగంలోకి తేవాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులంతా కృషి చేయాలని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. నీటి సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై అధికారులు పక్కాగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సోమవారం నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణ పనులపై ప్రాజెక్టు డెరైక్టర్ మొదలుకొని, జూనియర్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులందరితోనూ మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ కెనాల్ పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం హాజరయ్యారు. సాగర్ ఎడమ కాల్వ కింద చివరి ఆయకట్టు వరకూ నీరందించేలా కృషి చేయాలని, మనం చేసే ప్రయత్నం రైతుల ఆత్మహత్యల నివారణకు ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జూలై 10వ తేదీలోగా కాల్వల్లో ఉన్న చెట్లు, మట్టి, కంకర గుట్టలు, అనవసర వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. గత రబీలో రైతాంగానికి అవసరమైన నీటిని అందించగలిగామని, ఈ ఏడాది కూడా అదే పనితీరు కనబర్చాలని సూచించారు. క్వార్టర్లలో విద్యుత్ పంపిణీపై సమీక్ష.. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెందిన క్వార్టర్లలో గృహ విద్యుత్ పంపిణీ విధానంపై టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులతోనూ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న సాగర్, ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీ ప్రాజెక్టులకు చెందిన నివాస క్యాంపుల గృహ విద్యుత్ పంపిణీ విధానం మార్పుపై ముఖ్యంగా సమీక్ష జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వాడకం వల్ల ప్రభుత్వానికి 40 ఏళ్లుగా తీవ్ర నష్టం జరుగుతున్న దృష్ట్యా వాటిని లోటెన్షన్ విద్యుత్‌లోకి మార్చి సరఫరా చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. డిస్కంలకు క్యాంపు కాలనీలు బకాయిపడ్డ రూ.38.8 కోట్లను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
కుట్రల ‘బాబు’.. గోతిలో పడ్డాడు!
త్వరలోనే తగిన మూల్యం చెల్లించకతప్పదు: హరీశ్‌రావు సిద్దిపేట జోన్: ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే నవ్వొస్తుంది.. జాలేస్తుంది. తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. ఇది నగ్న సత్యం.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాత్రి మెదక్ జిల్లా సిద్దిపేట ఎన్జీవో భవన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారాన్ని చంద్రబాబు మసిపూసి మారేడుకా య చేస్తున్నాడు.. తెలంగాణ ప్రభుత్వంపై గొంతు చించుకొని అరిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నాడు తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొని, అడ్డగోలుగా కుట్రలు చేశాడు, ఆవిర్భావం అనంతరం విద్యుత్ సమస్యను సృష్టించేం దుకు కుట్ర పన్నాడు. అలాంటి కుట్రల బాబు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హరీశ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేను రేవంత్‌రెడ్డి ద్వారా తన వైపు తిప్పుకునేందుకు చేసిన కుట్రలో చంద్రబాబు పాత్ర యావత్ ప్రపంచానికి తెలిసిందేనన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని మరల్చేందుకు బాబు ప్రయత్నిం చడం సరికాదన్నారు. రేవంత్ ఉదంతం తెలంగాణ ప్రభుత్వ కుట్రగా అభివర్ణిస్తూ గగ్గోలు పెట్టడం.. దొంగే దొంగ దొంగ.. అని అరిచినట్టుగా ఉందన్నారు. రాజీనామా చేస్తేనే చంద్రబాబుకు గౌరవం నైతికత ఉంటే చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీ నామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని హరీశ్ అన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు కుట్రలను మరిచిపోలేదని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్నారు. -
పశువులకూ ’108’ తరహా సేవలు
పటాన్చెరు: గ్రామగ్రామాన రైతులఇళ్ల వద్ద పాడి పశువుల సంపద పెరగాలని నీటిపారుదలశాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శుక్రవారం జిల్లా స్థాయి పశుప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పశువుల ప్రాణాలను నిలబెట్టేందుకు అవసరమైన అత్యవసర సేవలందించేందుకు 108 వంటి అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. త్వరలో ఈ అంబులెన్స్ సేవలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పశువైద్య విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతుకు విద్యుత్ సబ్సిడీ: పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇన్సూరెన్స్ పథకాన్ని పశువుల కోసం ప్రవేశపెట్టిందన్నారు. రైతులు ఇన్సూరెన్స్ కోసం రూ.200 ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము ప్రభుత్వం భరిస్తుందన్నారు. రూ. 60 వేల వరకు బీమా సొమ్ము పొందవచ్చని సూచించారు. పాడిరైతుల అభివృద్ధికి విజయ డెయిరీ పాలసేకరణలో రైతుకు లీటర్‌కు రూ.4 అదనంగా ఇస్తున్నామని, దీంతో మిగతా అన్నిడెయిరీలు రైతులకు అదే ధరను ఇవ్వాల్సి వచ్చిందని దాంతో రైతుకు లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు బుద్ధి మందగించింది
నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదు: మంత్రి హరీశ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అవకాశవాది అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు కాసుకుంటూ బతికేవారని బాబు చేసిన విమర్శలకు హరీశ్‌రావు తీవ్రంగా ప్రతిస్పందించా రు. శుక్రవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబుకు వయసు పెరుగుతుంటే బుద్ధి మందగించి, విచక్షణ కోల్పోయి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు.1982లో కేసీఆర్ టీడీపీలో చేరితే.. చంద్రబాబు 1983లో వచ్చారన్నారు. ఆయన రాజకీయల్లోకి వచ్చిన రోజున కేవలం రెండెకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందని, ఈరోజు రూ. 2 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ పుట్టడమే మూడెకరాల బంగ్లాలో పుట్టారని, ఆయన రాజకీయాల్లోకి వచ్చాక తన ఇల్లును ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది యాదవ సోదరులు గొర్రెలు కాసుకొని జీవనం చేస్తున్నారని, గొర్రెలు కాయడం పాపం, అంటరానితనం అనే విధంగా బాబు మాట్లాడియాదవవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు వెంటనే యాదవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
త్వరలో ఎస్సీ కమిషన్ : హరీశ్‌రావు
సంగారెడ్డి/గజ్వేల్/సిద్దిపేట: త్వరలో ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. విభజన సమస్యల వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు గజ్వేల్, సిద్దిపేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి సభల్లో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లే అవకాశం లేకుండా తమ ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ మండలి ద్వారానే సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. భూపంపిణీ కోసం రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో 587 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. -
‘కమీషన్ కాకతీయ’ పై సర్కార్ దృష్టి!
మంత్రి హరీష్ సమీక్ష రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరాదని అధికారులకు మార్గనిర్దేశం ఫిర్యాదుల సేకరణకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనుల్లో రాజకీయ నేతలు కమీషన్లకు పాల్పడుతున్నారన్న ‘సాక్షి’ కథనంపై నీటి పారుదల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ కథనంపై మంగళవారం సచివాలయంలో అధికారులతో విసృ్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పనుల ఆరంభానికి క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు, అధికారులకు స్థానికంగా ఎదురవుతున్నా సమస్యలపై ఆరా తీశారు. అధికారులెవరూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరాదని, అలాంటివాటిని తమ దృష్టికి తేవాలని సూచించారు. పనుల్లో అత్యంత పారదర్శకత పాటించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని, దీనికి విరుధ్దంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా ఉంటామనే హెచ్చరికను ఆయన పం పినట్లుగా తెలుస్తోంది. అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన మంత్రి, రాజకీయ జోక్యం తగ్గించేందుకు తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపినట్లుగా సమాచారం. ఇక మిషన్ కాకతీయ పనులపై క్షేత్రస్థా యిలో ఎదురౌతున్న ఇబ్బందులను ఎప్పటికప్పు డు స్వీకరించి, వాటికి పరిష్కారాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను నీటి పా రుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషికి అప్పగించినట్లుగా శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక బార్కోడ్.. ఇదే సమయంలో మంత్రి ఇంజనీరింగ్ విభాగాలు, సచివాలయం ఉద్యోగుల మధ్య ఉండాల్సిన సమన్వయంపైనా ప్రత్యేకంగా అధికారులకు సూచనలు చేశారు. శాఖ ఫైళ్ల కదలికలో వేగం, పారదర్శకత పెంచాలని, అవసరమైతే ఫైళ్ల కదలికలో బార్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సోమ, బుధవారాల్లో సాగునీటి ప్రాజెక్టులపై, శనివారం మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్‌ను కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. రంగంలోకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మిషన్ కాకతీయ పెద్ద ఎత్తున ఆరంభమై, వేగ వంతమైన నేపథ్యంలో పనుల పర్యవేక్షణపై విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగిం ది. ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు ల భించిన చెరువుల వివరాలు, అందులో టెండర్లు ఖరారైనవి, ఒప్పందాలు కుదుర్చుకున్నవి తదితరాల వివరాలన్నింటినీ విజిలెన్స్ శాఖ తెప్పించుకున్నట్లు తెలిసింది. పునరుధ్దరణ పనులు మరింత పుంజుకున్నాక తమ కార్యాచరణ ఆరంభిస్తామని శాఖ అధికారులు వెల్లడించారు. -
ముంపు నిర్వాసితులకు మంచి ప్యాకేజీ: హరీశ్‌రావు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్లతో ముంపునకు గురయ్యే గ్రామాలను సహాయ పునరావాసం కింద మంచి ప్యాకేజీ అందజేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం ఈ అంశమై టీఆర్ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్వాసితులకు మార్కెట్ రేటుకు మూడురె ట్లు, ఎస్సీ, ఎస్టీలకు అయితే నాలుగు రెట్లు పరిహారం చెల్లిస్తామన్నారు. ఇక ప్రాణ హిత ఎత్తు, లెండి, పెన్‌గంగ, ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుల సత్వర పూర్తికి సరిహద్దు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 75 వేల మందికొక 108: లక్ష్మారెడ్డి 108, 104 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉందని, దానిని 75 వేల మందికి ఒకటి అందుబాటులో ఉంచేలా వాటి సంఖ్యను 506కు పెంచామన్నారు. బడ్జెట్లో సైతం వాటి నిర్వహణకు రూ.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి చర్యలు: సీఎం రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మంగళవారం ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్లు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మైనార్టీల సంక్షేమానికి వీలుగా సచార్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సూచనలు చేయలేదని చెప్పారు. రాష్ట్ర పరిధిలోనే మైనార్టీల అభివృద్ధికి స్కాలర్షిప్పులు, స్టడీ సర్కిళ్లు, విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. -
టీడీపీ గూడు ఖాళీ
సిద్దిపేట జోన్: తెలంగాణలో టీడీపీ దుకాణం ఖాళీ కానుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో హరీష్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో టీడీపీ కనుమరుగైందన్నారు. మిగతా ప్రాంతాల్లో మిగిలిన ఆ కొద్దిమంది కూడా భవిష్యత్తులో ఉండరన్నారు. టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు బాబు డెరైక్షన్తోనే తూప్రాన్‌లో సమావేశం నిర్వహించి టీఆర్ఎస్ సర్కార్‌పై బురదజల్లే చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ఆంధ్రాలో అక్కడి ప్రజలకు రుణమాఫీ, పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు అందిస్తున్న చంద్రబాబు, హైదరాబాద్‌లోని ఆంధ్రా వారికి నివాసం పేరిట రుణమాఫీని వర్తించకుండా చేశారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో బాబు మోసం తెలియక ఓట్లేసిన హైదరాబాద్‌లోని ఆంధ్రా ఓటర్లు నేడు చంద్రబాబు నిజ స్వరూపాన్ని గుర్తించారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పాపానికి రుణమాఫీని దూరం చేసిన బాబుకు త్వరలో బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. ముఖ్యంగా పింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆహార భద్రతా కార్డుల కోసం వీటిని వినియోగించడం జరిగిందన్నారు. తొమ్మిది నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేస్తున్న ఎర్రబెల్లి, రేవంత్‌లు తమ నియోజకవర్గాల్లో పర్యటించి పథకాల పనితీరును తెలుసుకోవాలన్నారు. మన పథకాలను కాపీ కొడుతున్న బాబు.. తెలంగాణలోని పథకాలను ఆంధ్రాలో కాపీ కొడుతున్న చంద్రబాబును ప్రశ్నించే ధైర్యాన్ని నేర్చుకోవాలని ఆ పార్టీ నేతలకు హరీష్‌రావు హితవు పలికారు. ఆంధ్రాలో ఇరవై కిలోల బియ్యం సీలింగ్ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో దళితుల భూ సేకరణకు రూ.19 కోట్లను ఖర్చు చేశామన్నారు. మరో రూ.20 కోట్లతో జిల్లాలో భూ సేకరణకు చర్యలు చేపడుతున్నామన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు జిల్లాలో విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల సభ్యత్వాలను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 28 వరకు కొనసాగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు రామచంద్రం, మూర్తి బాల్‌రెడ్డి, కోల రమేష్‌గౌడ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, మరుపల్లి శ్రీను, శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 1070 కోట్లతో గోదాముల నిర్మాణం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 1,070 కోట్లతో 21.54 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం చేపట్టాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. మూడు దశల్లో వీటిని నిర్మిస్తారు. దీనికి సంబంధించి ఆ శాఖమంత్రి టి.హరీశ్‌రావు బుధవారం నాబార్డు సీజీఎం, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, సహకార, వేర్ హౌసింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 54.24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములు అవసరమని గుర్తించామన్నారు. అయితే ప్రస్తుతం 32.70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉన్నాయని... ఇంకా 21.54 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఒక లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాము నిర్మాణానికి రూ. 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఆ ప్రకారం 21.54 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి రూ. 1,070 కోట్లు ఖర్చు కాగలవని వివరించారు. మూడు దశల్లో వాటిని నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ముందుగా ఈ ఏడాది రూ. 300 కోట్లతో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించాలని, ఆ మేరకు ప్రాంతాలను గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నాబార్డు ఆర్థిక సహకారంతో వీటిని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును ఈ నెలాఖరులోగా తయారుచేసి తనకు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.