‘మైనింగ్’ మంత్రి పేషీకి ‘మట్టి దందా’ ! | sand danda on Mining works | Sakshi
Sakshi News home page

‘మైనింగ్’ మంత్రి పేషీకి ‘మట్టి దందా’ !

Published Mon, Jan 18 2016 5:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

‘మైనింగ్’ మంత్రి పేషీకి ‘మట్టి దందా’ !

‘మైనింగ్’ మంత్రి పేషీకి ‘మట్టి దందా’ !

సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణం కోసం రూ.8 కోట్ల విలువ చేసే మట్టి, మొరం తవ్వకాల భాగోతం గనులు, భూగర్భశాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేషీకి చేరినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ జరిమానా వేసిన సుమారు రూ. 8 కోట్లను రద్దు చేయాలని కాంట్రాక్టర్లు మంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు సమాచారం. ఆర్మూరు-నిజామాబాద్‌ల మధ్య రైల్వేలైను పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల మొరం, మట్టి అక్రమంగా తవ్వారు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది.

రేవూరు నారాయణరెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, జీవీఆర్ కన్‌స్ట్రక్షన్, మిలీనియం కన్‌స్ట్రక్షన్‌ల జాయింట్ వెంచర్ కాంట్రాక్టు సంస్థలతో పాటు జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈలను బాధ్యులను చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్‌వీ భట్‌లు ఇటీవల నోటీసులు జారీ చేశారు. కాగా, అభివృద్ధి పనుల కోసమే మట్టి తవ్వామని  కాంట్రాక్టు సంస్థలు హైకోర్టుకు విన్నవించాయి. రివి జన్ పిటిషన్ సమర్పించిన ఆ సం స్థలు రాజకీయ నేతలతో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.  జరిమా నా, మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement