మాట్లాడుతున్న డాక్టర్ సౌజన్యా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఘట్‌కేసర్ అత్యాచారం కేసు విచారణను కీసర పోలీసులు వేగవంతం చేశారు. విచారణ అధికారిగా కీసర ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్‌ను నియమించారు. ఘట్‌కేసర్ సీఐ చంద్రబాబునాయుడు సెలవులో వెళ్లడంతో విచారణ అధికారిగా నరేందర్ గౌడ్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నియమించారు. మరోవైపు బాధితురాలిని నారపల్లి క్యూర్ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం తిరిగి క్యూర్ ఆస్పత్రికి పోలీసులు తరలించనున్నారు. మత్తు మందు ఇచ్చి అమ్మాయిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తరువాత నిందితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులపై 365 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుగుతున్నారు.
గురువారం క్యూర్ హాస్పిటల్ డాక్టర్ రణధీర్ రెడ్డి, మేడ్చల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పద్మ మీడియాతో మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థిని బుధవారం రాత్రి 8.20 గంటలకు పోలీసులు తమ ఆస్పత్రిలో చేర్చినట్లు రణధీర్ రెడ్డి తెలిపారు. అప్పటికే బాధితురాలు అపపస్మారక స్థితిలో ఉందని, ఒంటిపై కొన్ని చోట్ల గాయాలు అయ్యాయన్నారు. రాడ్లతో విచక్షణ రహితంగా విద్యార్థినిపై దాడి చేయడంతో కాలి గాయం అయ్యిందన్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ అన్ని వైద్య పరీక్షలు చేశారనన్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి బాగానే ఉందన్నారు. వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థినిపై లైంగికదాడి యత్నం జరిగిందని బాధితురాలికి చికిత్స అందించిన క్యూర్ హాస్పిటల్ డాక్టర్ సౌజన్యా రెడ్డి తెలిపారు. ఒక్కరు కాదు ముగ్గురు దుండగులు ఉన్నారని బాధితులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు సృహ లేకుండా ఉందని, పోలీసులే ఆమెను తీసుకొచ్చారన్నారు. ఫార్మసీ విద్యార్థిని విషయం తెలియగానే హాస్పిటల్‌కు చేరుకున్నామని మేడ్చల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారి జ్యోతి పద్మ తెలిపారు. మంత్రి ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం తరలించారని, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫార్మసీ విద్యార్థిని పైన అత్యాచారం జరిగిందా లేదా అనేది రిపోర్టులు వచ్చాక వెల్లడిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వ్యక్తుల్లో, వ్యక్తిత్వాల్లో మార్పు రావాలని అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో విద్యార్థిని క్షేమంగా ఉందన్నారు. ఘట్‌కేసర్ ఘటన పైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు రిపోర్ట్ అందిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment