ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. అయితే ఆమె పోలీసులకు చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ కేసులో ఏం జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ఘటన జరిగిన రోజు నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వరకు ఆమె ఆటోలో వచి్చంది. ఆ తర్వాత ఓఆర్‌ఆర్ ఘట్‌కేసర్ వరకు మార్గమధ్యలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే ఒంటరిగానే రోడ్డుపై ఆమె నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆటోడ్రైవర్ల పాత్రపై పక్కా ఆధారాలు లేకపోవడం, వేరేవాళ్ల మీద అనుమానాలు లేకపోవడంతో అసలు ఏం జరిగిందనేది తెలియక రాచకొండ పోలీసులు తికమకపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో తమ ఆటోడ్రైవర్లను అనవసరంగా బద్నాం చేస్తున్నారంటూ ఆటోడ్రైవర్ల సంఘాలు ఆందోళనకు దిగడం కూడా ఖాకీలకు తలనొప్పిగా మారింది. కేవలం అనుమానంతోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, అయితే ఆ నేరం తమవారే చేసినట్టుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకే సవాల్..
కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ వాసి బుధవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తూ.. నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్ బస్టాప్ వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో అక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ఆటోడ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్ చేసేందుకు యత్నించారని చెప్పడంతో తొలుత పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు. గురువారం బాధితురాలిని లోతుగా విచారించిన పోలీసులు నిర్భయ చట్టం కింద వివిధ కేసులు నమోదు చేశారు. అలాగే శుక్రవారం బాధితురాలు పోలీసుల విచారణలో తెలిసిన వ్యక్తులే నమ్మించి తీసుకెళ్లారని చెప్పారనే వివరాలతో కూడిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తుండటంతో పోలీసుల విచారణకు అడ్డంకిగా మారుతోంది. దీంతో రాచకొండ పోలీసులు ఇటు సాంకేతిక అంశా లను ఆధారంగా చేసుకొని విచారణ వేగిరం చేశారు. మరోవైపు వైద్యులు ఇచ్చే నివేదిక కూడా పోలీసులకు కీలకంగా మారనుంది.
చదవండి: ఘట్కేసర్ అత్యాచార కేసు: విస్తుపోయే నిజాలు
బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
Comments
Please login to add a commentAdd a comment