Medchal Crime News: An Auto Driver Molestation Assaulted A Minor Girl - Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై అఘాయిత్యం... పరువుపోతుందని..

Published Wed, Apr 6 2022 9:12 AM | Last Updated on Wed, Apr 6 2022 9:30 AM

An Auto Driver Molestation Assaulted A Minor Girl - Sakshi

సాక్షి, మేడ్చల్‌/మేడ్చల్‌ రూరల్‌: ఓ ఆటో డ్రైవర్‌ మైనర్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన గౌడవెళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట్‌ ప్రాంతానికి చెందిన  వెంకటేష్, గౌడవెళ్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళ ఇంటి సమీపంలో ఉంటున్న బాలిక(15)తో అతడికి ఏర్పడింది. మార్చి 31న ఆటోలో గౌడవెళ్లికి వచ్చిన వెంకటేష్‌ స్కూల్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి  తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఏప్రిల్‌ 1న బాధితురాలి స్నేహితురాళ్లు సదరు బా లిక ఒక్కతే ఆటోలో వెళ్లిన విషయం క్లాస్‌ టీచర్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీచర్‌ బాధితురాలిని పిలిచి ఆరా తీయగా వెంకటేష్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చె ప్పింది. దీంతో టీచర్‌ బాధితురాలి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది..అయితే వారు పరువు ఎక్కడ పోతుందనే కారణంతో ఫిర్యాదు చేయలేదు. సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలిక ద్వారా విష యం తెలుసుకున్న టీచర్‌ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో వారు సోమవారం సాయంత్రం మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

(చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement