
పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధి కోసం రాజస్థాన్ రాష్ట్రం నుంచి నగరానికి సదరు మహిళ కుటుంబం తరలి వచ్చింది. ఆ క్రమంలో ఆ కుటుంబం ఘట్కేసర్ లో స్థిరపడింది. అయితే ఆ మహిళను గత కొంతకాలంగా ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.
దాంతో ఆమె తీవ్ర కలత చెంది... శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.