persecutions
-
కట్నం వేధింపులతో మహిళ మృతి
కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి బచ్చన్నపేట : అదనపు కట్నం కోసం వివాహితపై భర్త, బావ, ఆడపడుచూ, అత్త కలిసి ఈనెల 10న ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన ఘటన బచ్చన్నపేటలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గట్టు సిద్దయ్య మూడో కూతురు స్నేహ(సంధ్య)(25)కు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన బుస్స నాగరాజుతో 2008లో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో అన్ని కట్నకానుకలను ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో వెట్టి చాకిరీ చేయించడంతో పాటు ఆమె పుట్టింటి వారు ఎవరైనా వచ్చినప్పుడు సంధ్యను గదిలో ఉంచి తాళం వేసి బంధువులను కలవనిచ్చేవారు కాదు. ఈ విషయమై పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని మృతురాలి తల్లిదండ్రులు చెప్పారు.ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి కాయిన్ బాక్స్‌తో తమకు ఫోన్ చేసేదని తెలిపారు. ఈ నెల 10న భర్త నాగరాజు, బావ శ్రీనివాస్, ఆడపడుచు పుష్ప, అత్త రాజమణి, తోటి కోడలు శ్రీదేవి కలసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి బాత్రూంలో వేసి డోర్ వేశారనీ, సంధ్య అరుపులు విని ఇరుగు పొరుగు వారు రాగానే ‘అయ్యో.మా కోడలు ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ’ డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద్రాబాధ్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని చెప్పారు. తమ కూతురు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సంధ్యకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్‌కుమార్ మాట్లాడుతూ మృతురాలి భర్త నాగరాజు, బావ శ్రీనివాస్, అత్త రాజమణి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారని, అంత్యక్రియలు పూర్తయ్యేవరకు జామీనుపై పంపించామని తెలిపారు. -
పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం
గుంతకల్ టూటౌన్ పోలీసుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు... గుంతకల్ పట్టణంలోని గుత్తిరోడ్డులో మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో జాకీర్ హుస్సేన్ అనే యువకుడు మంగళవారం ఉదయం ఇంటి దగ్గర పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. జాకీర్ హుస్సేన్ వెల్డింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హుస్సేన్ తండ్రి జిలాన్పాషా మట్కా రాసే పని చేసేవాడు. పాషా రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. అయితే, హుస్సేన్ కూడా మట్కా రాసే పని చేస్తున్నాడన్న అనుమానంతో టూటౌన్ పోలీసులు హుస్సేన్‌ను గత 15 రోజులుగా తీసుకెళ్లి విచారిస్తున్నారు. రూ.85 వేలు కట్టాలని పోలీసులు డిమాండ్ చేశారని, కట్టలేననడంతో రోజూ విచారణ పేరుతో తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చి సాయంత్రం వదిలిపెడుతున్నారని హుస్సేన్ తల్లి మల్లికాబేగం తెలిపారు. పోలీసుల వేధింపులతో ఆందోళన చెందే హుస్సేన్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపించారు. -
పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య
-
పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధి కోసం రాజస్థాన్ రాష్ట్రం నుంచి నగరానికి సదరు మహిళ కుటుంబం తరలి వచ్చింది. ఆ క్రమంలో ఆ కుటుంబం ఘట్కేసర్ లో స్థిరపడింది. అయితే ఆ మహిళను గత కొంతకాలంగా ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. దాంతో ఆమె తీవ్ర కలత చెంది... శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
ఖానాపురం, న్యూస్‌లైన్ : అత్తింటి వేధింపులతో ఓ మహిళ ఉరివేసుకు ని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తౌడోజు కృష్ణకు ఇల్లందుకు చెందిన స్రవంతి(25)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణ మహబూబాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అనోన్యంగా ఉంటున్న వారికి ఒక కుమారుడు జన్మించాడు. కొంతకాలంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివా రం రాత్రి స్రవంతికి ఆమె అత్తమామలతో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న భర్త ముగ్గురిని మందలించాడు. దీంతో మనోవేదనకు గురైన స్రవంతి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంత సేపటకీ బయటికి రాకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరివేసుకుని కనిపించింది. దీంతో స్రవంతిని కిందకిదింపి చూడగా అప్పటికే మృతిచెందింది. అత్తమామల సూటిపోటి మాటలతోనే... తన కూతురు ఆత్మహత్యకు ఆమె అత్త,మామలు సరోజన, బిక్షమాచారియే కారణమని మృతురాలి తల్లిదండ్రులు నాగాచారి, విజయలక్ష్మి రోదిస్తూ తెలిపారు. కొంత కాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు కూతురు చెప్పిందని, అనారోగ్యంతో బాధపడినా తిడుతున్నారని, ‘నీవు చస్తే మా కొడుక్కు రెండో పెళ్లి చేస్తామని బాధపెట్టేవారని’ కూతురు తమతో చెప్పిందన్నారు. గొడవలు అవే సర్దుకుపోతాయని సర్దుకుపోవాలని కూడా చెప్పామని ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. వారి వేధింపులు ఎక్కువయ్యేసరికే తట్టుకోలేక ఉరివేసుకుని చనిపోయందన్నారు. ఈ విషయమై ఎస్సై గణపతి నరేష్‌ను వివరణ కోరగా మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.